సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇండస్ట్రీ పెద్దలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇచ్చారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన వెంటనే దిల్ రాజు ఇదే పనిమీద ఉన్నారు. ముఖ్యమంత్రితో సమావేశమై అన్నీ సెట్ చేస్తున్నారు.
“ప్రభుత్వం, పరిశ్రమను దూరం చేస్తోందంటూ చాలా రకాల వార్తలు చూస్తున్నాం. సీఎం ఒకటే చెప్పారు. పరిశ్రమకు కావాల్సినవన్నీ ఎఫ్ డీ సీ ద్వారా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇండస్ట్రీకి ఏం కావాలన్నా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. రేపు లేదా ఎల్లుండి అపాయింట్ మెంట్ ఇస్తానన్నారు. ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్లి ముఖ్యమంత్రిని కలుస్తాం. పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యలు తలెత్తకుండా చూసుకునే బాధ్యతను సీఎం నాకు అప్పగించారు.”
తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ కేసుకు సంబంధించి కూడా దిల్ రాజు మాట్లాడారు. ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి తను చొరవ తీసుకొని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
“వివాదం ఎలా నడుస్తోంది, ఎలాంటి మలుపులు తీసుకుంటుందో మనందరికీ తెలుసు. ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి కూడా బాధ్యత తీసుకొని, వీలైనంత తొందరగా సమస్యను పరిష్కారమయ్యేలా చేస్తాను. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టం. ఎవ్వరూ కావాలని చేయరు కదా. ఆ పరిస్థితుల వల్ల అలా జరిగింది.”
మరికాసేపట్లో అల్లు అర్జున్ ను కూడా కలవబోతున్నారు దిల్ రాజు. ఇటు ముఖ్యమంత్రితో మాట్లాడానని, అటు బన్నీతో కూడా మాట్లాడి, చెప్పాల్సిందంతా చెప్పి సమన్వయం చేస్తానని స్వయంగా ప్రకటించారు.
తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి భర్త భాస్కర్ కు ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చారు దిల్ రాజు. ఆయన్ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి, శాశ్వత ప్రాతిపదికన ఓ ఉద్యోగంలో పెట్టే ఆలోచనను ముఖ్యమంత్రితో చర్చించినట్టు వెల్లడించారు.
ఈయన ఎలా ఫుల్ స్టాప్ పెడతారు
చట్టం తన పని తాను చెయ్యాలి గా
full stop ante .. emiti chestaru .. case kotestara .?
అంతే..! ఆ తింగరోడికి ఓ స్త్రీని కూడా చూసి పెళ్లి చేయండి. ఆ చనిపోయిన మహాతల్లి ఆత్మ, ప్రాణాలతో పోరాడుతున్న చిన్నారి గురించి మనందరం మరచిపోదాం.
అల్లు అర్జున్ మే 11 న నంద్యాల వెళ్ళాడు.
సంధ్య లో ఘటన 11 కి జరిగింది.
అల్లు అర్జున్ ని A11 గా చేర్చారు..
మళ్ళీ ఉదయం 11 గం..కి రమ్మని నోటీసులు ఇచ్చారు..
నీ వెనక 11 అనే దరిద్రం ఉంది 🤣😂🤦️..
అది పొతే గాని నువ్వు గట్టెక్కవ్
Atleast 11 months శిక్ష పడాలి
మా “లెవెన్ మోహన్” గాడి చూపు పడితే ఎవ్వడి బతుకైనా బస్టాండ్ కావాల్సిందే..
అర్థమైందా అల్లూ??
అంటే కోర్టు లో వున్న విషయం ను నువ్వు ఎలా సెటిల్ చేస్తావు. అంటే పోలీసు దర్యాప్తు, బెయిల్, రేవతి ప్రాణం, శ్రీ తేజ్ జీవచ్చవo, అల్లు అర్జున్ రోడ్డు షో, ఇవి అన్ని మట్టి కొట్టుకొని పోతాయా ఇ పెద్ద మనిషి రాగానె.
Maranthe కదా ipc bns అయ్యింది కానీ వ్యక్తులు కాదు…శశికళ దక్క స్వతంత్ర భారత్ లో పూర్తి శిక్ష ఏ corrupted/criminal కి పడి ది
Ayithe Dil Raju broker aa?
కాదు safe game player….poisonous opportunist
broker, nee movies kosam enthaina chestadu
Hi
టాటా, బిర్లా
సజ్జల.. సుబ్బి.. మధ్యలో A1ల0గా గాడు