వివాదాస్పద గులాబీ పార్టీ ఎమ్మెల్యేకు బెయిల్ 

కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో అనర్హత వేటు పడుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై దాడి చేశాడన్న దాడి చేశాడన్న ఆరోపణల మీద అరెస్టు చేసిన హుజూరాబాద్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ లభించి ఊరట కలిగింది. దాడి కేసులో పాడి కౌశిక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ క‌రీంన‌గ‌ర్ జ‌డ్డి తీర్పునిచ్చారు.

పాడి రిమాండ్ రిపోర్ట్‌ను జ‌డ్జి కొట్టేశారు. క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌రేట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హ‌ల్ చ‌ల్ చేశార‌ని, ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశార‌ని ఆయ‌న‌పై మొత్తం 3 కేసుల‌ను పోలీసులు న‌మోదు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై న‌మోదైన కేసులు అన్ని కుడా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసులేన‌ని ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాదులు తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏడు సంవత్సరాల శిక్ష పడే వాటికి బెయిల్ మంజూరు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునందుకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నాడు. కోర్టుకు వెళ్లే క్రమంలో మీడియాతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడాడు. అరెస్ట్ చేసినా ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నాడు.

ఆరు గ్యారంటీలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పాడు. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నిస్తామన్నాడు . ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని విరుచుకుపడ్డాడు . సంక్రాంతి పండుగ పూట అరెస్టులు అన్యాయమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నాడు.

కౌశిక్ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడే. 2018 లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అయితే ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయాడు. 2021 లో గులాబీ కండువా కప్పుకున్నాడు. అప్పటి నుంచి ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా మారాడు. వివాదాస్పదుడిగా మారాడు. గులాబీ పార్టీలో చేరగానే కేసీఆర్ ఆయన్ని ఎమ్మెల్సీ చేద్దామనుకున్నారు.

గవర్నర్ కోటాలో సామాజిక సేవకుడిగా నామినేట్ చేయాలని ప్రతిపాదించారు. అయితే అప్పటి గవర్నర్ తమిళశై వ్యతిరేకించారు. దీంతో గవర్నర్ ను కౌశిక్ రెడ్డి దూషించాడు. ఇది పెద్ద చర్చనీయాంశమైపోయింది. తరువాత కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి విజయం సాధించినా ఆ సమయంలో ఆయన చేసి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

తనను గెలిపిస్తే విజయ యాత్ర చేస్తానని లేదంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని, ప్రజలు తన శవ యాత్రకు రావాలని ప్రకటించాడు. ఓటర్లు ఏమనుకున్నారోగానీ కౌశిక్ రెడ్డిని గెలిపించారు. అతని వ్యాఖ్యలపై పోలీసు కేసు కూడా నమోదైంది. గిరిజన మంత్రి అయిన సీతక్కపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీపై ఘర్షణకు దిగాడు. దీనిపైనా పోలీసు కేసు నమోదైంది. అసెంబ్లీ సమావేశాల్లో పేపర్లు చింపి సభ్యులపై విసిరేశాడు. స్పీకర్ హెచ్చరించినా వినలేదు. ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో అనర్హత వేటు పడుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

3 Replies to “వివాదాస్పద గులాబీ పార్టీ ఎమ్మెల్యేకు బెయిల్ ”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.