హరిహర వీరమల్లు సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ కు ముహూర్తం లాక్ అయింది. 17వ తేదీన ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయబోతున్నారు.
పవన్ కల్యాణ్ ఆలపించిన ఈ సాంగ్ ఆల్రెడీ లీక్ అయింది. దీంతో ఈరోజు ప్రోమో వదిలారు. “వినాలి.. వీరమల్లు మాట చెబితే వినాలి” అనే డైలాగ్ తో ప్రోమో రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను 17వ తేదీ ఉదయం 10 గంటల 20 నిమిషాలకు రిలీజ్ చేస్తారు.
“మాట వినాలి గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి..” అనే లిరిక్స్ తో జానపద శైలిలో పాడే ఈ పాటను పవన్ ఆలపించగా.. పెంచల్ దాస్ సాహిత్యం అందించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు.
ప్రస్తుతం జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 28న హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ Vs స్పిరిట్ సినిమా రిలీజ్ అవుతుంది.
17 న కదా… చూద్దాం….
Waiting.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Dabba movie