‘ఆర్ఆర్ఆర్’ వచ్చింది, ఎన్నో రికార్డులు సృష్టించింది. రీసెంట్ గా ‘పుష్ప-2’ వచ్చింది. చాలా రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఇంత సునామీలో కూడా ఓ రికార్డ్ చెక్కుచెదరలేదు. అది ‘కేజీఎఫ్-2’ పేరిట ఉంది.
యష్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్టయింది. కేజీఎఫ్ ఇచ్చిన హైప్ తో సీక్వెల్ రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ హైప్ కు అద్భుతమైన స్క్రీన్ ప్లే, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడయ్యాయి. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది కేజీఎఫ్-2.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైన ఈ సినిమా.. అన్ని సెంటర్లలో, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. అలా దేశవ్యాప్తంగా 856 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఈ రికార్డ్ ను పుష్ప-2 అధిగమించింది.
అయితే కేజీఎఫ్-2 క్రియేట్ చేసిన ఓ రికార్డ్ అలానే ఉంది. విడుదలైన ప్రతి భాషలో మినిమం 50 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రంగా కేజీఎఫ్-2 నిలిచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా ప్రతి వెర్షన్ కు మినిమం 50 కోట్లు వచ్చాయి. పుష్ప-2 ఆ ఘనత సాధించలేకపోయింది.
ఇండియాలో అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచినప్పటికీ.. కన్నడ, మలయాళం వెర్షన్లలో ఈ సినిమా 50 కోట్ల మార్క్ అందుకోలేకపోయింది. అలా కేజీఎఫ్-2 నెలకొల్పిన అరుదైన రికార్డ్ ను పుష్ప-2 అధిగమించలేకపోయింది.
2 పిచ్చా పూ సినిమాలే..నేను .ott లో చూసా అందులో కూడా బొక్కే…
yes
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ