మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టు కాంగ్రెస్ అగ్రనేత, లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణ చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయాన్ని సోనియా గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే తమ అభ్యంతరాలను సీఈసీ పట్టించుకోలేదని విమర్శించారు.
దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని, అయోధ్యలో రామాలయం నిర్మాణం జరిగినప్పుడే వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారని రాహుల్ విరుచుకుపడ్డారు. దేశంలో రెండు భావజాలాలు ఉన్నాయన్నారు. రాజ్యాంగబద్ధమైన భావజాలం తమదని, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలమని ఘాటు విమర్శ చేశారు. ఆర్ఎస్ఎస్‌తో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ భావజాలంలో పెద్ద, చిన్న కులాలు, ఇతర బేధాలు ఉండవన్నారు. ఇవే అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారని రాహుల్ గాంధీ అన్నారు. మోహన్ భగవత్ రాజ్యాంగం చెల్లుబాటు కాదని చెబుతున్నారని, బ్రిటిష్ మీద జరిగిన పోరాటాన్ని గుర్తించడం లేదని రాహుల్ విమర్శించారు.
ఆర్ఎస్ఎస్‌కు జాతీయ పతాకంపై ఏ మాత్రం గౌరవం లేదన్నారు. అలాగే రాజ్యాంగ విలువలపై నమ్మకం లేదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారాయన. ఈ కొత్త భవనం కాంగ్రెస్ భావజాలానికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు.
పెద్ద పాపమ్మ మరియు పెద్ద పప్పు కలుస్తే గిట్లనే ఉంటది
Someone cannot swallow said it’s Tuesday!!!
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ