సంక్రాంతి వారంలో కూడా ఆసక్తిదాయకమైన సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. థియేటర్లలో సినిమాలు ప్రేక్షకులను ఏ మేరకు ఎంగేజ్ చేయగలుగుతున్నాయో కానీ, ఓటీటీలో అయితే అలాంటి లోటు లేదు. ప్రత్యేకించి విభిన్న భాషల సినిమాలు, వెబ్ సీరిస్ లు వరసగా వస్తూ ఓటీటీ ప్రేక్షకులకు అనునిత్యం వినోదాన్ని ఇస్తూ ఉన్నాయి.
విశేషం ఏమిటంటే.. ఈ వారం కూడా ఒక మలయాళీ సినిమా ఆసక్తిని రేపుతూ ఉంది. గత వారంలో సూక్ష్మదర్శిని రూపంలో ఒక మలయాళీ సినిమా వినోదాన్ని పంచింది. ఆ థ్రిల్లర్ తర్వాత ఈ వారంలో మలయాళీ సినిమా *పని* విడుదల కాబోతోంది. ఇది జోజూ జార్జ్ సినిమా. ఇతడి సినిమాలు ఇది వరకూ తెలుగు ప్రేక్షకులకు ఓటీటీల ద్వారా సుపరిచితమే. జోసెఫ్, ఇరట్టా వంటి సినిమాలతో జోజూ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన *పని* సినిమా సోనీ లైవ్ లో ఈ వారంలోనే విడుదల అవుతోంది. మలయాళంలో థియేటరికల్ గా ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. దర్శకుడిగా జోజూ తొలి సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓటీటీలో దీన్ని ఓ చూపు చూడవచ్చు.
ఈ వారంలోనే మరో హిట్ మలయాళీ సినిమా విడుదల అవుతోంది ఓటీటీలో. ప్రేమలు సినిమా హీరో ప్రధాన పాత్రలో నటించిన ఐ యామ్ కాదలన్ జనవరి 17వ తేదీన మనోరమా మ్యాక్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమాకూ థియేటరికల్ రిలీజ్ అప్పుడు మంచి రివ్యూలే వచ్చాయి. ఐఎండీబీలో కూడా ఈ సినిమాకు మంచి రేటింగ్ ఉంది.
ఇటీవలే థియేటర్లలో విడుదలైన విడుదలై 2 కూడా ఈ వారంలోనే ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. జీ5లో ఈ సినిమా విడుదల కానుంది. థియేటరికల్ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా పెద్ద పాజిటివ్ రివ్యూలు పొందలేదు కానీ, ఫస్ట్ పార్ట్ హిట్ నేపథ్యంలో ఇది ఓటీటీలో వీక్షకాదరణ పొందే అవకాశం ఉంది.
ఈ వారంలో వస్తున్న మరో మలయాళీ థ్రిల్లర్ రైఫిల్ క్లబ్. ఇది జనవరి 16న నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది. ఈ సినిమా కూడా థియేటర్లలో విడుదల సందర్భంగా పాజిటివ్ రివ్యూలనే పొందింది. వెస్ట్రన్ ఘాట్స్ లో ఒక పురాతన రైఫిల్ క్లబ్ తో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇలా నాలుగు సౌత్ సినిమాలు ఈ సినిమాలు ఈ వారంలో ఓటీటీ విడుదలతో ఆసక్తిని రేపుతున్నాయి.
ఇక జనవరి 17 న పాతల్ లోక్ 2 వెబ్ సీరిస్ అమెజాన్ లో విడుదల కానుంది. కరోనా లాక్ డౌన్ సమయాల్లో పాతాల్ లోక్ వెబ్ సీరిస్ వీక్షకాదరణ పొందిన వెబ్ సీరిస్ గా నిలిచింది. దాని సీక్వెల్ సీరిస్ ఈ వారంలో విడుదల అవుతోంది.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ