థియేటర్ల పంట పండుతోంది

అనుకున్నదే. సంక్రాంతి అంటే థియేటర్లు కళకళ లాడతాయి. ఫుల్స్ వస్తే..సైకిల్ స్టాండ్, క్యాంటీన్ ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది.

అనుకున్నదే. సంక్రాంతి అంటే థియేటర్లు కళకళ లాడతాయి. ఫుల్స్ వస్తే..సైకిల్ స్టాండ్, క్యాంటీన్ ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. ప్రతి టికెట్ కు అదనంగా పార్కింగ్ ఫీ కచ్చితంగా వుంటుంది. ఈ రోజుల్లో బైక్ లేదా కారు లేకుండా థియేటర్ కు వచ్చేది చాలా అంటే చాలా తక్కువ. ఇంటర్వెల్ ప్రతి టికెట్ మీద కనీసం 20 రూపాయల నుంచి 50 రూపాయల ఖర్చు తప్పకుండా ఉంటుంది. గతంలో మాదిరిగా ఏదో ఒక కూల్ డ్రింక్, పాప్ కార్న్ పెట్టి ఊరుకోవడం లేదు. రకరకాల తినుబండారాలు థియేటర్ల క్యాంటీన్ లో చోటు చేసుకుంటున్నాయి.

అందువల్ల క్యాంటీన్ ఆదాయం బాగుంటోంది. కానీ కండిషన్ ఏమిటంటే సినిమా బాగుండాలి. జనం పొలోమంటూ రావాలి. ఇదిలా వుంటే శ్లాబ్ సిస్టమ్ నడుస్తున్నందున పెద్ద థియేటర్ల ప్లేస్ లో చిన్న థియేటర్లు పెరిగాయి. సీటింగ్ కెపాసిటీ తక్కువ ఉంటోంది. ఇలాంటి టైమ్ లో సీట్ల వెనుక ముందు వున్న గ్యాప్స్ లో ప్లాస్టిక్ కుర్చీలు, టెంట్ హవుస్ సోఫాలు తెచ్చి పెడుతున్నారు. ఇదంతా లెక్కల్లోకి రాని అదనపు ఆదాయం అన్నమాట.

గేమ్ ఛేంజర్, ఢాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు మూడూ కూడా విడుదలయ్యాయి. వీటిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఊపు ఎక్కువ వుంది. ఢాకూ మహరాజ్ కూడా మాస్ బెల్ట్ లో బాగానే వుంది. గేమ్ ఛేంజర్ కు ఆరంభంలో ఎక్కువ థియేటర్లు పెట్టారు కనుక, పరిస్థితి చూసి అన్నీ సర్దుబాటు చేస్తున్నారు. అందువల్ల ఆ సినిమా కూడా థియేటర్లను ఫుల్స్ కు దగ్గర చేస్తోంది. అందువల్ల మొత్తం థియేటర్లలో సినిమా ఏది ఆడినా పార్కింగ్, క్యాంటీన్ ఆదాయాలు బాగున్నాయి.

అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆడుతున్న థియేటర్లకు ఓ అడ్వాంటేజ్ అదనంగా వుంది. ఫ్యామిలీ పిల్లలతో వస్తారు కనుక, క్యాంటీన్ ఖర్చు పక్కాగా వుంటుంది. ఫిబ్రవరిలో కూడా చాలా సినిమాలు వున్నాయి. అందువల్ల సమ్మర్ వచ్చే వరకు థియేటర్లకు ఢోకా లేదు.

9 Replies to “థియేటర్ల పంట పండుతోంది”

  1. సినిమా హళ్ళకి వచ్చే వాళ్ళకి ఉచిత స్నాక్స్ పథకాలు ఏమైనా ప్రకటిస్తే బాగుంటుంది

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.