టీటీడీలో ఆ ఇద్ద‌రితో గూడుపుఠాణి

మంత్రి నారా లోకేశ్ బంట్లు అయిన ల‌క్ష్మ‌ణ‌కుమార్‌, తోట చందు క‌లిసి టీటీడీలో గూడు పుఠాణి ఏదో చేస్తున్నార‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

మంత్రి నారా లోకేశ్ బంట్లు అయిన ల‌క్ష్మ‌ణ‌కుమార్‌, తోట చందు క‌లిసి టీటీడీలో గూడు పుఠాణి ఏదో చేస్తున్నార‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కొంత మంది మీడియా ప్ర‌తినిధుల‌తో ఆయ‌న మాట్లాడుతూ పైబ‌ర్‌నెట్ అక్ర‌మాల్లో నిందితుడిగా విచార‌ణ ఎదుర్కొంటున్న హ‌రికృష్ణ‌నాయుడికి వాళ్లిద్ద‌రు శిష్యులన్నారు. అందుకే టీటీడీలో ఏదో చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తున్నార‌నే అనుమానం క‌లుగుతోంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ల‌క్ష్మ‌ణ‌కుమార్, తోట చందు టాంటి నిపుణుల్ని టీటీడీలో వాడుకోవ‌డం స‌హ‌జంగా జ‌రిగేవ‌ని అడిష‌న‌ల్ ఈవో వెంక‌న్న చౌద‌రి వివ‌ర‌ణ ఇస్తూ దాట వేశారన్నారు. దీన్ని త‌మ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోంద‌న్నారు. ఎవ‌రినైనా నిపుణుల్ని వాడుకునే ప‌రిస్థితి ఉన్న‌పుడు, ఖ‌చ్చితంగా టీటీడీ బోర్డు ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సి వుంటుంద‌న్నారు. ఫలానా వ్య‌క్తుల మేధ‌స్సు, నైపుణ్యాన్ని ఏ ర‌కంగా వాడుకుంటారో బోర్డులో తీర్మానం చేసిన త‌ర్వాతే తీసుకుంటార‌ని ఆయ‌న గుర్తు చేశారు.

తోట చందు, ల‌క్ష్మ‌ణ‌కుమార్‌ను ఎవ‌రు తీసుకున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అడిష‌న‌ల్ ఈవో వెంక‌న్న చౌద‌రికి ఏం హ‌క్కు వుంద‌ని ఆయ‌న నిల‌దీశారు. అడిష‌న‌ల్ ఈవో ఎప్ప‌టికీ బోర్డు స‌భ్యుడు కాద‌న్నారు. అంతేకాదు, బోర్డు స‌మావేశంలో అడిష‌న‌ల్ ఈవో కూర్చోడానికి కూడా హ‌క్కు లేద‌న్నారు. అత‌నికి సంబంధించిన స‌బ్జెక్ట్ బోర్డు స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌స్తే, ఆహ్వానిస్తేనే లోప‌లికి వెళ్లి వివ‌ర‌ణ ఇవ్వాల్సి వుంటుంద‌న్నారు.

మీ కార్యాల‌యంలో వాళ్లిద్ద‌రిని ఉంచి, ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల్ని ఎందుకు అప్ప‌గించారో స‌మాధానం చెప్పాల‌ని ఏఈవో వెంక‌న్న చౌద‌రిని భూమ‌న ప్ర‌శ్నించారు. అస‌లేం గూడుపుఠాణి జ‌రుగుతోంద‌ని ఆయ‌న నిల‌దీశారు. నిపుణుల్ని టీటీడీలో వాడుకోవ‌చ్చ‌ని, వాడుకోవాల్సిన అవ‌స‌రం కూడా వుంద‌ని భూమ‌న అన్నారు. కానీ అన‌ధికారికంగా ఆ హ‌క్కు టీటీడీకి లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. మీరు చేసిన ఘోర త‌ప్పిదానికి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని వెంన్న చౌద‌రిని భూమ‌న డిమాండ్ చేశారు.

ల‌క్ష్మ‌ణ‌కుమార్‌, తోట చందు ఎందులో నిపుణులు? ఏం చేశారు? ఏదో జ‌రుగుతోంద‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. ఎవ‌రికి ద‌ర్శ‌నం క‌ల్పించాలి? అలాగే క‌ల్పించ‌కూడ‌దో వీళ్లిద్ద‌రి పాత్ర వుంద‌నే ఆరోప‌ణ‌ల‌పై ఈవో, ఏఈవో స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

5 Replies to “టీటీడీలో ఆ ఇద్ద‌రితో గూడుపుఠాణి”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.