నితిన్.. ఏదో మ్యాజిక్ జరగాలి

రాబిన్ హుడ్ సినిమా సక్సెస్ మేరకే తమ్ముడు సినిమా మార్కెట్ ఆధారపడి వుంటుంది.

నితిన్ హీరోగా రెండు సినిమాలు ఆల్ మోస్ట్ విడుదలకు రెడీగా వున్నాయి. వెంకీ కుడుమల డైరెక్షన్ లో రాబిన్ హుడ్, వేణు శ్రీరామ్ డైరక్షన్ లో తమ్ముడు. ఈ రెండు సినిమాలు మార్చిలో ఒకటి, సమ్మర్ లో మరొకటి విడుదల చేసే పని జరుగుతోంది.

కానీ నితిన్ సినిమాలకు ఎందుకో బజ్ రావడం లేదు. రాబిన్ హుడ్ టీజర్ వదిలారు. పుష్ప 2 హడావుడి జరుగుతుండగా చిన్న ఈవెంట్ చేసారు. కానీ ఇప్పటి వరకు రావాల్సిన బజ్ రాలేదు.

నిర్మాతలయిన మైత్రీ సంస్థ ఈ సినిమా మీద సరిగ్గా దృష్టి పెడుతున్నట్లు కనిపించడం లేదు. వాళ్లు తలుచుకుంటే ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తారు. కానీ అలాంటి ప్రయత్నం ఇప్పటి వరకు అయితే ప్రారంభం కాలేదు. పైగా ఈ సినిమాకు 70 కోట్ల వరకు ఖర్చయిందని తెలుస్తోంది. దాంతో ఆంధ్ర (సీడెడ్ మినహా) 12 కోట్ల రేటు చెబుతున్నారు. కానీ బయ్యర్లు అంత ఆసక్తి కనబర్చడం లేదు. మైత్రీ సంస్థ కనుక విడుదల సమస్య వుండకపోవచ్చు.

కానీ రాబిన్ హుడ్ సినిమా సక్సెస్ మేరకే తమ్ముడు సినిమా మార్కెట్ ఆధారపడి వుంటుంది. ఆ సినిమా కూడా దిల్ రాజు నిర్మాణం కనుక విడుదలకు సమస్య లేదు. కానీ రెండు సినిమాలు మంచి ఒపెనింగ్ తెచ్చుకోవాలి. మంచి కలెక్షన్లు తెచ్చుకోవాలి. అప్పుడే నితిన్ తరువాత లైనప్ ముందుకు వెళ్తుంది.

ఇలా సరైన ఓపెనింగ్, మార్కెట్ రావాలంటే మంచి బజ్ తీసుకురావాలి. కానీ ఆ ప్రయత్నం అయితే ఇంత వరకు కనిపించడం లేదు. రాబిన్ హుడ్ సినిమా ఓపెనింగ్ కేవలం నితిన్ కు మాత్రమే కాదు, దర్శకుడు వెంకీ కుడుమల కు కూడా అవసరం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇకనైనా స్పీడప్ చేయాలి. లేదంటే కష్టమే.

13 Replies to “నితిన్.. ఏదో మ్యాజిక్ జరగాలి”

  1. రాబిన్ హుడ్… పేరు మార్చి, పుష్ప 3 అని రిలీజ్ చేస్తే బజ్ వొస్త దంటవ??

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. నితిన్ రెడ్డి …నీ మూవీ హిట్ అవ్వాలంటే ఒకసారి వ-చ్చి మా పవన్ బూ-ట్లు నాకు… ఐపోతుంది హిట్

    1. ఓహో అప్పట్లో చిరంజీవి కూడా సినిమా hit అవ్వాలంటే డైరెక్టర్ కోదండ రామిరెడ్డి బూట్లు నాకే వాడ నీ చిరంజీవి…. ఐతే ఓకే…

      1. వాడు నిజానికి వైకాపా అభిమాని. .I pac రంగం లోకి దిగింది. ఇలా కులాల మధయ మతాల మధ్య గొడవలు పెట్టడం అతని ఆశయం.

      2. పేరు జన సైనికుడు అని ఉంటుంది లేదా టీడీపీ జెండా ఉంటుంది కానీ అతను నిజానికి నీలి మూకల అభిమాని

  4. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.