గురుమూర్తిని పట్టించిన ప్లాస్టిక్ బకెట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గురుమూర్తి కేసు, అత్యంత భయంకరమైన కేసుల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది.

భార్యను మర్డర్ చేసి, ముక్కలుగా కోసి, కుక్కర్ లో ఉడికించి.. ఇలా అత్యంత దారుణంగా హత్య చేసిన గురుమూర్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అలా అని అతడు తప్పించుకొని పారిపోలేదు. పోలీసుల కళ్ల ముందే ఉన్నాడు. కానీ అతడ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులకు సరైన సాక్ష్యాలే దొరకలేదు.

అందుకే వివిధ రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుల్ని రప్పించారు. ఎట్టకేలకు గురుమూర్తికి వ్యతిరేకంగా సైంటిఫిక్ సాక్ష్యాల్ని సంపాదించిన పోలీసులు, అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ విషయాల్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు స్వయంగా వెల్లడించారు. అసలు మాధవిని గురుమూర్తి ఎలా హత్య చేశాడనే విషయాన్ని సీన్-బై-సీన్ వెల్లడించారు.

ప్రకాశం జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డారు మాధవి-గురుమూర్తి. 39 ఏళ్ల గురుమూర్తి ఆర్మీలో ఫుల్ టైమ్ జవాన్ గా పనిచేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు. అతడి స్వస్థలం ప్రకాశం జిల్లా. సంక్రాంతికి భార్యాపిల్లల్ని తీసుకొని ఊరెళ్లాడు గురుమూర్తి.

ప్లాన్ ప్రకారం పిల్లల్ని అక్కడే వదిలేసి, భార్యను హైదరాబాద్ తీసుకొచ్చాడు. 15వ తేదీ ఉదయం ఇంటికొచ్చిన వెంటనే భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమెపై దాడి చేశాడు. ముందుగా ఆమె తలను గోడకు కొట్టాడు. ఆ తర్వాత ఆమెపై కూర్చొని గొంతు నులిమేసి చంపేశాడు. ఇంట్లో ఉన్న కత్తితోనే కాళ్లు, చేతులు, తల కట్ చేశాడు. అలా వేరుచేసిన శరీర భాగాల్ని ఉడికించాడు. ఉడికించిన తర్వాత శరీర భాగాల్ని స్టవ్ పై కాల్చాడు.. ఆ తర్వాత వాటిని ముక్కలు చేశాడు. ఎముకల్ని, మాంసం ముద్దల్ని వేరుచేసి మళ్లీ కాల్చాడు. ఎముకల్ని పౌడర్ చేశాడు.

పెయింట్స్ బకెట్ లో ఆ బూడిద, మిగిలిన కొన్ని చిన్న ముక్కల్ని వేసి, మీర్ పేట పెద్ద చెరువులో పడేశాడు. ఇదంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిచేశాడు. ఉదయం 10 గంటలకు హత్య చేసి, సాయంత్రం 6 గంటలకు ఆ బూడిదను చెరువులో కలిపేశాడు. ఇంటికొచ్చి 2-3 సార్లు పూర్తిగా కడిగాడు.

ఆ తర్వాత ఊరెళ్లి పిల్లల్ని తీసుకొచ్చాడు. ఇళ్లంతా ఒక రకమైన వాసన రావడంతో పిల్లలు ప్రశ్నించారు. వాళ్లకు ఏవో చెప్పి మభ్యపెట్టాడు. బెడ్ రూమ్ లో వాసన ఎక్కువగా ఉండడంతో, హాల్ లోనే పిల్లల్ని పడుకోబెట్టాడు. అలా 2 రోజులు చేశాడు. ఈ గ్యాప్ లో మాధవి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. తమ కూతురు ఎక్కడుందని అల్లుడ్ని ప్రశ్నించారు.

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లతో కలిసి తను కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. ఇలాంటి కేసుల్లో ముందుగా అనుమానించేది భర్తనే. పోలీసులు కూడా అదే పనిచేశారు. ఒక రోజు విచారణ తర్వాత గురుమూర్తి నేరాన్ని అంగీకరించాడు. అయితే ఆ తర్వాతే పోలీసులకు అసలైన సవాల్ ఎదురైంది.

నేరాన్ని నిరూపించడానికి పోలీసులు ఒక్క సాక్ష్యాన్ని కూడా సేకరించలేకపోయారు. ఎందుకంటే, మొత్తం బూడిద చేసి పడేశాడు గురుమూర్తి. ఇల్లు మొత్తం శుభ్రం చేశాడు. హత్యకు ఉపయోగించిన వస్తువులు, సామగ్రి మొత్తాన్ని క్లీన్ చేశాడు. దీంతో ఫోరెన్సిక్ సాక్ష్యాలు కూడా దొరకలేదు.

ఎట్టకేలకు చెరువులో బూడిద కలపడానికి గురుమూర్తి ఉపయోగించిన బకెట్ ను పోలీసులు కనుగొన్నారు. ఆ బకెట్ తో కేసు కొలిక్కి వచ్చింది. ఆ తర్వాత చెరువు నుంచి కొన్ని చిన్నచిన్న బాడీ పార్టుల్ని కూడా సంపాదించారు. ఇలా సాక్ష్యాలు దొరికిన వెంటనే గురుమూర్తిని అరెస్ట్ చేశారు. రేపు అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టి మరోసారి రిమాండ్ కోరుతారు.

అయితే ఇంత జరిగినప్పటికీ, గురుమూర్తి ఈ హత్య ఎందుకు చేశాడనేది బయటకురాలేదు. అతడికి ఎలాంటి వివాహేతర సంబంధాల్లేవని పోలీసులే చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య చాలా పంచాయితీలు జరిగాయని మాత్రమే బయటకు చెప్పిన పోలీసులు.. మిగతా విషయాల్ని కోర్టుకు చెబుతామన్నారు.

మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గురుమూర్తి కేసు, అత్యంత భయంకరమైన కేసుల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది.

9 Replies to “గురుమూర్తిని పట్టించిన ప్లాస్టిక్ బకెట్”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  3. ott lu vachaka violence movies,series chudatam alavatayindi…mundu mundu inka chala chustam ilantivi….butulani ki, ilanti murder laki alavatu padipotunnam

Comments are closed.