మాజీ సీఎం కొత్త విద్య నేర్చుకున్నాడోచ్!

ఏడాదిగా ఫార్మ్‌హౌస్‌లోనే ఉంటున్న కేసీఆర్ ఇప్పుడు మొబైల్ ఆపరేషన్ మీద దృష్టి పెట్టారు. మొత్తం మీద కొత్త విద్య నేర్చుకున్నారు.

మాజీ సీఎం, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ కొత్త విద్య నేర్చుకున్నారు. నిజానికి ప్రపంచంలో కోట్లాది మందికి ఈ విద్య వస్తుంది. కానీ దాదాపు డెబ్బయ్ ఏళ్ల వయసులో ఆయన ఈ కొత్త విద్య నేర్చుకున్నారు.

ఇంతకూ ఆయన నేర్చుకున్న విద్య ఏమిటి? ఈ వయసులో ఆయన కొత్తగా ఏదైనా అకడమిక్ కోర్సు చేశారా? కొత్తగా స్వదేశీ భాషో, విదేశీ భాషో నేర్చుకున్నారా? అలాంటిది ఏమీ లేదు. మరి ఇంతకూ కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత కొత్తగా ఏం నేర్చుకున్నారు?

ఇంతకూ ఆయన నేర్చుకున్న విద్య ఏమిటంటే మొబైల్ అంటే సెల్ ఫోన్ వాడటం నేర్చుకున్నారు. ఆయన సీఎంగా పదవిలో ఉన్న పదేళ్లలో ఎప్పుడూ సొంతంగా సెల్ ఫోన్ వాడలేదు. ఎవరితోనైనా ఫోన్ మాట్లాడదలచుకుంటే తన దగ్గర ఎవరన్నా ఉండగా నంబర్ కలిపి ఇవ్వమని అడిగేవారు. కలిపిస్తే మాట్లాడేవారు.

ఇక ఇప్పుడు కేసీఆర్ ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంతంగా మొబైల్ ఆపరేట్ చేయడం నేర్చుకున్నారు. ఇది ఆయన సొంతంగా నేర్చుకున్నారా? కాదు. మనుమడు, అంటే కేటీఆర్ కుమారుడు హిమాంశు, తాతయ్యకు మొబైల్ ఆపరేట్ చేయడం నేర్పించాడు. ఇప్పుడు ఆయన తాను మాట్లాడాల్సిన సన్నిహితుల, ముఖ్యుల ఫోన్ నంబర్లు సేవ్ చేసుకుంటున్నారు.

ఈ కాలంలో ఐదారేళ్ల పిల్లలు సైతం మొబైల్ ఆపరేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ కొందరు పెద్దవాళ్లకు ఆపరేట్ చేయడం రాదు. ఇదేమీ తప్పు పట్టాల్సిన విషయం కాదు. ఎప్పుడూ రాజకీయాల్లో, ఉద్యమంలో బిజీగా ఉన్న కేసీఆర్ మొబైల్ ఆపరేషన్ మీద దృష్టి పెట్టి ఉండకపోవొచ్చు. ఏడాదిగా ఫార్మ్‌హౌస్‌లోనే ఉంటున్న కేసీఆర్ ఇప్పుడు మొబైల్ ఆపరేషన్ మీద దృష్టి పెట్టారు. మొత్తం మీద కొత్త విద్య నేర్చుకున్నారు.

7 Replies to “మాజీ సీఎం కొత్త విద్య నేర్చుకున్నాడోచ్!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. KCR బెటర్ కానీ మా “బీదమోహన్ రెడ్డి” కి ఐతే సెల్ ఫోనే లేదు, ఉన్నా దానికి నెంబర్ లేదు..అపద్దం కాదు, కావాలంటే మీరు TV9 రజినికాంత్ ని అడిగి కంఫర్మ్ చేసుకోండి..

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.