తండేల్..చైతూ-సాయిపల్లవి జోడీ సినిమా. చందు మొండేటి దర్శకత్వం..బన్నీ వాస్ నిర్మాణం. ఫిబ్రవరి 7న విడుదల కాబోయే ఈ సినిమా ట్రయిలర్ వచ్చేసింది. దాదాపు ఏడాదిన్నరగా వార్తల్లో వుంటూ వస్తోందీ సినిమా. మేకర్లు భారీగా కబుర్లు చెబుతున్నారు. కానీ సినిమా ఎలా వుండబోతోందో తెలియదు.
శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల జీవితాల్లో జరిగిన సంఘటన ఆధారంగా కార్తీక్ అనే రచయిత అందించిన మూల కథ ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇంతకీ ఈ ట్రైలర్ ఎలా వుంది?
అందరూ ఊహించినట్లుగానే మత్స్యకారుల జీవన నేపథ్యం, వారిలో ఓ జంట ప్రేమ గాథ, హీరో పాక్ సైనికులకు చిక్కడంతో ఒకరికి ఒకరు దూరమైన ప్రేమ జంట. ఇది కథలో ఒక భాగం, మరో భాగం, పాకిస్ధాన్ గడ్డ మీద, పాక్ సైనికుల అరాచకాలను తట్టుకుంటూ, తమ లోని దేశభక్తిని వీరోచితంగా ప్రదర్శించడం అన్నది మరో భాగం. ఈ రెండింటినీ సమానంగా అల్లుతూ ట్రైలర్‌ను కట్ చేసారు.
ట్రైలర్ ఎక్కడా బ్రేక్ తీసుకోలేదు. ఫీల్ గుడ్ మూమెంట్స్, ఎమోషనల్ సీన్లు అన్నీ ఒకే పేస్ లో సాగాయి. ట్రైలర్ లో పడిన డైలాగులు బాగున్నాయి. పాక్ గడ్డ మీద మనవాళ్ల మాటల సంగతి అలా వుంచితే పల్లవి..చైతూల నడుమ మాటలు సహజంగా వున్నాయి. బుజ్జితల్లీ పాటకు వాడిన సిగ్నేచర్ ట్యూన్ ను ట్రైలర్ లో అక్కడక్కడ వాడారు.
సముద్రం మీద చిత్రీకరించిన థ్రిల్లింగ్ విజువల్స్ ను ట్రైలర్ లో అక్కడక్కడ పెర్ ఫెక్ట్ గా మిక్స్ చేసారు. మొత్తం మీద ఇప్పటి వరకు తండేల్ మీద వున్న అంచనాలను పెంచేందుకు కచ్చితంగా దోహదం చేసేలా వుంది ట్రైలర్.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
సాయిపల్లవి ఒకసారి మా పవన్ తో చేసి నీ జీవితం ధన్యం చేసుకో
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ