జీవీఎంసీలో కూడా కూటమి జెండా ఎగరనుందా?

కార్పొరేషన్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.

రాష్ట్రంలో మరొక కీలకమైన నగర కార్పొరేషన్ వైఎస్సార్ కాంగ్రెస్ చేజారనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సభ్యులను వైసీపీ నుంచి తమ పార్టీల్లో చేర్చుకోవడం అనేది అలవాటుగా జరిగిపోతూ ఉంది. ఇప్పటికే పలుచోట్ల వైస్ ఛైర్మన్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలను కూటమి గెలుచుకుంది. కొన్ని కార్పొరేషన్లను కూడా దక్కించుకుంది.

ఈ నెలలో కార్పొరేషన్లకు నాలుగేళ్ల గడువుకాలం అనేది పూర్తి కాబోతుండడంతో.. అవిశ్వాస తీర్మానాలు పెట్టడం ద్వారా.. ఇంకా అనేక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు వారి పరం కాబోతున్నాయి. ఈ క్రమంలో విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కూడా కూటమి ఖాతాలో పడబోతోంది. తాజాగా తొమ్మిది మంది కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరబోతున్నారు. మరో ముగ్గురు జనసేనలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పై కూటమి పతాక ఖాయంగా తేలుతోంది.

ఫిరాయింపులను ప్రోత్సహించే రాజకీయాల్లో నైతికతను ప్రశ్నించే రోజులు ఇవాళ లేవు. కూటమి గెలిచిన దగ్గరి నుంచి వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ప్రలోభపెట్టి, బెదిరించి తమతో కలిపేసుకుంటున్నారు. ఆ పర్వం పలుచోట్ల ఇప్పటికే పూర్తయింది.

98 స్థానాలున్న విశాఖ కార్పొరేషన్లో ప్రస్తుతం 97 మంది ఉన్నారు. తెలుగుదేశం తరఫున తొలుత గెలిచింది 29 మంది కాగా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 11 మంది చేరడంతో ఆ బలం 40కు చేరింది. జనసేన తరఫున ముగ్గురు తొలుత గెలవగా, ఏడుగురు కొత్తగా ఆ పార్టీలో చేరడంతో వారి బలం 10 అయింది. భాజపా తరఫున తొలుత ఒకరు గెలువగా, వైసీపీ నుంచి ఒకరు చేరాక బలం 2కు పెరిగింది. కూటమి బలం 52 అయింది. సోమవారం మరో తొమ్మిది మంది కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరడానికి సిద్ధపడ్డారు.

వారిని బుజ్జగించి పార్టీ వీడకుండా చూడడానికి వైసీపీ అగ్రనేతలు బొత్స సత్యానారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాధ్ రంగంలోకి దిగారు గానీ.. ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు. తెదేపాలో చేరడం కోసం అమరావతి చేరుకున్న వారిలో చల్లా రజని, గేదెల లావణ్య, కెల్ల సునీత, భూపతిరాజు సుజాత, ముర్రు వాణి మరో నలుగురు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ 9 మంది తోపాటు, జనసేనలోకి ముగ్గురు వెళితే.. 52గా ఉన్న కూటమి బలం 64గా మారుతుంది.

ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. అందుకు సరిపడా కార్పొరేటర్లతో ఆల్రెడీ సంతకాలు సేకరించారు. మొత్తానికి ఈ నెలలోనే జీవీఎంసీ కార్పొరేషన్, తాజా ఫిరాయింపుల పుణ్యమాని కూటమి ఖాతాలోకి రాబోతోంది.

6 Replies to “జీవీఎంసీలో కూడా కూటమి జెండా ఎగరనుందా?”

  1. గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ కి పోకుండా, తాడేపల్లి ప్యాలెస్ లో తేరగా పండి pubg ఆడుకుంటున్న… 11లంగా పార్టీ మీద ప్రజావ్యతిరేకత రాదా అంటూ.. తన పెళ్ళాం రంకు మొగుడు గొడ్డలి ఎత్తాడట.. So రేపటినుండి రావొచ్చు అని ప్యాలెస్ వర్గాల అంచనా..

Comments are closed.