బెట్టింగ్ యాప్ లు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. యువతరాన్ని ప్రలోభపెట్టి, లోబరచుకుని వారి వినాశనానికి మాత్రమే కాదు, ఆత్మహత్యలకు కూడా కారణం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నేరస్తులను కూడా తయారు చేస్తున్నాయి. ఏ రకంగా చూసినా కూడా.. బెట్టింగ్ యాప్ లు సమాజ ప్రశాంత గమనానికి విఘాతంగా మారుతున్నాయని ఒప్పుకోవాల్సిందే.
ఈ యాప్ లను ప్రమోట్ చేస్తూ పెయిడ్ ప్రకటనలు చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల తీరును కూడా తప్పుపట్టాల్సిందే. ఈ విషయంలో ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆరంభించిన పోరాటం ప్రశంసించాల్సిందే. యాప్ లకు ప్రచారం చేయడం మంచి పని కాదని, నేరం అవుతుందని ఆయన చేసిన ట్వీట్ తెలంగాణ పోలీసులలో చాలా పెద్ద కదలికనే తీసుకువచ్చింది.
తెలంగాణ పోలీసులు ఇప్పుడు అనేకమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద కేసులు పెడుతున్నారు. నిన్నటికి నిన్న 11 మంది మీద కేసులు నమోదు అయ్యాయి. వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఉన్నారు. నిందితుల్లో సెలబ్రిటీలు, టీవీ నటులు కూడా ఉన్నారు. తాజాగా ఇదే ఆరోపణల మీద మంచు లక్ష్మి మీద కూడా కేసు నమోదు చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రయత్నం అంతా కూడా బాగానే ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ పూనిక వహించిన తర్వాత.. పోలీసులు ఈ మాత్రం స్పందించడంలో తప్పేం లేదు.
కానీ.. ఇక్కడ సామాన్యులకు ఒక ధర్మసందేహం వస్తుంది. చాలా పాతతరహా సందేహం ఇది. బెట్టింగ్ యాప్ లు తప్పు అంటున్నారు. వాటిగురించి ప్రచారం చేయడమే పెద్ద నేరం అని చెప్పి కేసుల్లో బుక్ చేస్తున్నారంటే.. ఆ యాప్ ను నిర్వహించడం అనేది ఇంకా పెద్ద నేరమే అని అనుకోవాలి. మరి అలాంటి బెట్టింగ్ యాప్ లను ఈ దేశంలో పనిచేసేలా ఎందుకు అనుమతిస్తున్నారు. సాంకేతికంగా ఎంతో అడ్వాన్స్‌డ్ గా ఉన్న మన ప్రభుత్వాలు మన దేశంలో అసలు బెట్టింగ్ యాప్ లు పనిచేయకుండా చేసేస్తే ప్రజలందరూ ఎంతో సేఫ్ గా ఉంటారు కదా.. అనేది సామాన్యుడి సందేహం.
పొగాకు ప్రకటనల గురించి కూడా ఇలాంటి సందేహాలు ప్రజలకు వస్తుంటాయి. పొగాకు తాగవద్దని అన్నేసి ప్రకటనలు ఇచ్చే బదులు- పొగాకు ఉత్పత్తుల్ని, సిగరెట్ సహా పూర్తిగా నిషేధిస్తే పోతుంది కదా అని వాదించే వారుంటారు. అయితే వాటి అమ్మకాల ద్వారా వచ్చే పన్నులకు ఆశపడి ప్రభుత్వాలు అంత గొప్ప నిర్ణయం తీసుకోవు అనే సమాధానం కొందరినుంచి వస్తుంటుంది.
బెట్టింగ్ యాప్ ల విషయంలో ప్రభుత్వానికి దక్కే పన్నులు కూడా ఏమీ ఉండకపోవచ్చు. మరి వాటిని నిషేధించడానికి ప్రభుత్వానికి వస్తున్న ఆటంకం ఏమిటి? సజ్జనార్ వంటి పెద్దలు.. తమ ట్వీట్లతో పోలీసుల్ని ఉత్తేజపరిచి ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టించే బదులు.. ప్రభుత్వంలోని పెద్దలకే నివేదించి.. అసలు అలాంటి యాప్ లను మనదేశంలో పనిచేయకుండా చేయవచ్చు కదా.. అనేది సామాన్యుల సందేహం.
బెట్టింగ్ యాప్ లు మాత్రమే కాదు. లోన్ యాప్ లు కూడా.. సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. అనేక జీవితాలు ఛిద్రమైపోవడానికి, ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. వాటికి ప్రచారం ఏమీ జరగడం లేదు గానీ.. మధ్యతరగతి జీవితాలు బలైపోతున్నాయి. బెట్టింగ్ యాప్ లతో పాటు, లోన్ యాప్ లు కూడా ఈ దేశంలో పనిచేయకుండా పోలీసు పెద్దలు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
Sajjanar is doing Great Job. Really we must appreciate him. 6 out of 10 ppl are losing because of Betting Apps.
బెట్టింగ్ యాప్ ల మాయలో పడి ఆస్తులు గుల్ల చేసుకుని ఎవరైనా చనిపోతే ఆత్మహత్య చేసుకుని మొదట వేలు చూపించిదే పోలీసులు మీద…
తన పరిధిలో ఉన్న పని చేసిన కూడా మనకి మంటే…
pysa syamala ni gullistunnaru TG polisulu.
app create chese vallu velallo vuntaru.. and betting addadam crime kadu as per law.
kaani main vishayam entente .. EE influncers aa apps ni rastram lo anni villages ki kooda easy ga publicity chesthunnaru.. dani valli mass destrcution jaruguthundhi.. last 10 years mundhu veeti takidi intha vundedha… ledu kada ..
social media influencers ki social responsiabilty vundali..
Shyamala peu undani pisukkuntunnavaa..
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
పైన భేష్ అని టైటిల్ పెట్టి కింద సామాన్యుల ధర్మ సందేహం పేరుమీద ఈ ఏడుపంతా మన శ్యామల మీద కేసెట్టినందుకేగా ?
Yevaeu
Betting / Gambling is a state issue. In india betting is legal in a few states. AP & Telangana lo illegal. Kabatti ee companies vere state lo register cheskuni anni states lo valla activities chestaru. Ee issue chala Grey area. Anduke law kuda gattiga em cheyalekapotundi. Betting apps paina tax untundi. Avi ee state lo register cheste aa state government ki taxes kadatay. Courts kuda chala bhunnamaina teerpulu ichay. Ex. Dream 11 anedi oka rakamaina gambling. Kanu court ee game skills involve aindi. Luck factor deentlo emi undadu. So skilled games are not illegal , yedhechaga adkovachu antundi. Kabatti law and governments ni tappu pattakunda mana buddhi vadukuni nirnayam teeskovali. Manam tagakappte e company mandu cogarette tayaru cheyavu. Manam adakapothe betting apps musivestaru. Mundu manam janalamu marali.