షాకింగ్.. కిడ్నాప్ టైమ్ లో వాళ్లిద్దరూ అక్కడే!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ రావు బ్రదర్స్ ను కిడ్నాప్ చేస్తున్న సమయంలో.. మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త…

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ రావు బ్రదర్స్ ను కిడ్నాప్ చేస్తున్న సమయంలో.. మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి అక్కడే ఉన్నట్టు పోలీసులు నిర్థారించారు. 

ఈ మేరకు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ (సాంకేతిక సాక్ష్యాల్ని) పోలీసులు సంపాదించారు. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల వేషాలు వేసుకున్న కిడ్నాపర్లు.. ప్రశ్నిస్తామంటూ ప్రవీణ్ రావు సోదరుల్ని కార్లు ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. 

ఈ తతంగం మొత్తాన్ని కొద్ది దూరం నుంచి భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ పరిశీలించారని, ఎప్పటికప్పుడు వాళ్లకు సమాచారం అందిస్తూ వచ్చారని పోలీసులు నిర్థారించారు. అంతేకాకుండా.. కిడ్నాపర్ల కార్లకు కొద్దిదూరంలో వీళ్లు కూడా ప్రయాణించినట్టు కనుగొన్నారు. అంతేకాకుండా.. భార్గవరామ్, గుంటూరు శీను ఒకే కారులో ఉన్నట్టు గుర్తించారు.

అయితే ఈ విషయాలపై కస్టడీలో ఉన్న అఖిల ప్రియ స్పందించలేదు. కిడ్నాప్ కు యత్నించిన విషయాన్ని అంగీకరించిన అఖిల.. తన భర్త, తమ్ముడు ప్రమేయాన్ని మాత్రం నిర్థారించలేదు. వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తనకు తెలియదంటూ సమాధానం దాటవేశారు. ప్రస్తుతం భార్గవ్ తో పాటు గుంటూరు శీను కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

భార్గవ రామ్ మహారాష్ట్రలో, గుంటూరు శీను కర్నాటకలో ఉన్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రవీణ్ రావు బ్రదర్స్ ను హైదరాబాద్ శివార్లలోని సన్ సిటీ ప్రాంతంలో వదిలేసిన తర్వాత.. అక్కడికి అతికొద్ది దూరంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వీళ్లు కలిసి ప్రయాణించినట్టు పోలీసులు గుర్తించారు. 

ఆ తర్వాత ఎవ్వరికీ దొరకకూడదనే ఉద్దేశంతో.. సిమ్ కార్డులు పారేసి, ఒకరు మహారాష్ట్రకు, మరొకరు కర్నాటకకు పారిపోయినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుతం వీళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని ఈ రెండు రాష్ట్రాలకు పంపించారు.

మరోవైపు అఖిల ప్రియ పోలీస్ కస్టడీ ముగిసింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ రోజంతా ఆమె జైలులోనే ఉంటారు. ఆమె తరఫు లాయర్, బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరుగుతుంది. 

న‌వ్విపోదురు గాక‌..మాకేటి సిగ్గు