ఇటు డేటింగ్ రూమర్స్.. అటు నిశ్చితార్థంపై పుకార్లు

హీరోయిన్ పరిణీతి చోప్రాపై మొన్ననే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ప్రేమాయణం సాగిస్తోందనే పుకార్లు ఊపందుకున్నాయి. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ నుంచి ఇద్దరు కలిసి బయటకొస్తున్న వీడియోతో ఈ…

హీరోయిన్ పరిణీతి చోప్రాపై మొన్ననే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ప్రేమాయణం సాగిస్తోందనే పుకార్లు ఊపందుకున్నాయి. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ నుంచి ఇద్దరు కలిసి బయటకొస్తున్న వీడియోతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఓవైపు వీళ్ల డేటింగ్ పై ఇలా కథనాలు వస్తున్న టైమ్ లోనే, ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారంటే ఊహాగానాలు మొదలవ్వడం విశేషం. దీనికి ఓ కారణం ఉంది.

ఓవైపు వీళ్ల బంధం ఇలా కొనసాగుతుండగానే, మరోవైపు ఇంకో ఆప్ ఎంపీ వీళ్లిద్దరిపై ట్వీట్ చేశారు. ఏకంగా ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈయన వేసిన ట్వీట్ వైరల్. పరిణీతి-రాఘవ్ బంధాన్ని ఆయన కన్ ఫర్మ్ చేయడమే కాదు.. ఏకంగా ఇద్దరికీ నిశ్చితార్థం కూడా పూర్తయిందనే విషయాన్ని పరోక్షంగా చెప్పి, శుభాకాంక్షలు అందించారు.

దీంతో పరిణీతి-రాఘవ వ్యవహారం మరింత హైలెట్ అయింది. ఈ పుకార్లకు ఊతమిస్తూ, పరిణీతి సిగ్గుపడుతూ మీడియాకు ఎదురవ్వడం మరో కొసమెరుపు.

ముంబయి ఎయిర్ పోర్టులో మీడియాకు ఎదురుపడింది పరిణీతి. వెంటనే ఆమెను డేటింగ్ రూమర్స్ పై మీడియా ప్రశ్నించింది. దానికి ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. పైపెచ్చు ముసిముసిగా నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ అక్కడ్నుంచి వెళ్లిపోవడం పుకార్లకు మరింత తావిచ్చినట్టయింది.

నిజంగా రఘవ్ తో డేటింగ్ లాంటివేం లేకపోతే, పరిణీతి ఓపెన్ గా ఖండించి ఉండొచ్చు. కానీ ఆమె ఆ పని చేయకపోవడంతో, పుకార్లు మరింత పెరగడమే కాకుండా.. వీళ్ల ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయిందంటూ కథనాలు వస్తున్నాయి.