కీర‌వాణికి ఇది క‌ఠిన ప‌రీక్షే!

సినీ ఇండ‌స్ట్రీలో వార‌సుల హ‌వానే ఉంటుంద‌నేది కొత్త‌గా చెప్పేదేమీ కాదు. ఇండ‌స్ట్రీలో పాత‌కుపోయిన వ్య‌క్తుల వార‌సులు మ‌రో ఆలోచ‌నే లేకుండా సినిమాల మీదే దృష్టి నిలుపుతూ ఉన్నారు. అలా స‌క్సెస్ అయ్యే వార‌సులు ఎంత‌మంది…

సినీ ఇండ‌స్ట్రీలో వార‌సుల హ‌వానే ఉంటుంద‌నేది కొత్త‌గా చెప్పేదేమీ కాదు. ఇండ‌స్ట్రీలో పాత‌కుపోయిన వ్య‌క్తుల వార‌సులు మ‌రో ఆలోచ‌నే లేకుండా సినిమాల మీదే దృష్టి నిలుపుతూ ఉన్నారు. అలా స‌క్సెస్ అయ్యే వార‌సులు ఎంత‌మంది ఉంటున్నారో, స‌క్సెస్  కాలేక‌పోయిన వార‌సులు కూడా అంతే మంది ఉంటారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి వార‌సులు ఇద్ద‌రూ ఒకేసారి త‌మ ల‌క్ ను ప‌రీక్షించుకుంటున్నారు.

వారికి ఇది ప‌రీక్షే. బ‌హుశా కీర‌వాణికి ఇది క‌ఠిన ప‌రీక్ష కావొచ్చు. ఇండ‌స్ట్రీలో వార‌సులు స‌క్సెస్ కాలేక‌పోతే తండ్రుల‌పై ఉండే ప్రెజ‌ర్ అంతా కాదు సుమా! ఇప్ప‌టికే కీర‌వాణి సొంత చెల్లెలు, సొంత సోద‌రులు.. ఇండ‌స్ట్రీలో త‌మ వంతు ప్ర‌య‌త్నాల‌ను చేశారు, చేస్తూనే ఉన్నారు. సంగీతం, న‌ట‌న రంగాల్లో వారి ప్ర‌య‌త్నాలున్నాయి. ఇప్పుడు కీర‌వాణి త‌న‌యులు ఇద్ద‌రూ ఒకేసారి రెండు రంగాల్లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు.

ఒక‌రు హీరోగా, మ‌రొక‌రు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. 'మ‌త్తువ‌ద‌ల‌రా' అనే ఆ సినిమా రేపు విడుద‌ల కాబోతూ ఉంది. ఇది వ‌ర‌కూ బాల‌న‌టుడిగా ప‌లు సినిమాలు చేశాడ‌ట కీర‌వాణి ఒక త‌న‌యుడు శ్రీ సింహా. య‌మ‌దొంగ సినిమాలో ఎన్టీఆర్ చిన్న‌ప్ప‌టి పాత్ర‌ను ఇత‌డే చేశాడ‌ట‌. 

ఇక 'రంగ‌స్థ‌లం' సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసి, ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడ‌ట ఇత‌డు. ఇక ఇప్ప‌టికే సింగ‌ర్ గా ప‌లు పాట‌లు పాడిన కీర‌వాణి మ‌రో త‌న‌యుడు కాల‌భైర‌వ ఈ సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడు అవుతున్నాడు. మ‌రి కీర‌వాణి వార‌సుల ప్ర‌స్థానం ఎలా ఉంటుందో!