కమల్ హాసనే.. జయలలిత పాత్రకు సెట్ అయ్యేవాడట!

ఒకవైపు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ల పై ఆమె బంధువులు కోర్టులకు ఎక్కారు. వాటిని ఆపాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. తమిళనాట అన్నాడీఎంకే అధికారంలో ఉన్నంత సేపూ ఇలాంటి సినిమాలు ఎంత…

ఒకవైపు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ల పై ఆమె బంధువులు కోర్టులకు ఎక్కారు. వాటిని ఆపాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. తమిళనాట అన్నాడీఎంకే అధికారంలో ఉన్నంత సేపూ ఇలాంటి సినిమాలు ఎంత వరకూ విడుదల అవుతాయనేది సందేహమే!

ఆ సంగతలా ఉంటే.. జయలలిత బయోపిక్ ల రూపకర్తలు మాత్రం లుక్స్ మీద లుక్స్ విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇలాంటి సినిమాలు రెండు మేకింగ్ లో ఉన్నాయి. వాటిల్లో ఒకదాంట్లో నిత్యామీనన్ టైటిల్ రోల్ లో నటిస్తోంది. మరోటి కంగనా రనౌత్ ది.

జయలలితగా నిత్యామీనన్ ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదల చేశారు. అది మార్ఫింగ్ పిక్చర్ లా అనిపించింది. జయలలిత ఒరిజినల్ పిక్చర్ కు  నిత్యామొహాన్ని అతికించి మార్ఫ్ చేసినట్టుగా ఉన్నారు.

ఇక కంగనా రనౌత్ జయలలిత లుక్ మాత్రం కామెడీగా మారింది. నెటిజన్లు ఈ విషయంలో ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ట్రోలింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. కొందరు  అయితే సరదా కామెంట్లు చేశారు.
 
'ఇదేం లుక్ బాబోయ్.. కంగనా నువ్వు మంచి నటే ఒప్పుకుంటున్నాం కానీ, నీ కన్నా కమల్ హాసన్ కు మేకప్ వేసి ఉంటే.. జయలలిత పాత్రలోకి చక్కగా ట్రాన్స్ ఫామ్ అయ్యే వాడేమో..' అంటూ  నెటిజన్లు స్పందిస్తున్నారు. 'చాచీ 420'  లో కమల్ హాసన్ లుక్ ను షేర్ చేస్తూ వారు ఈ కామెంట్ చేశారు!

ఇక మరి  కొందరు ఆ మధ్య వచ్చిన మోడీ బయోపిక్ తో ఈ లుక్ ను  పోల్చారు. ఆ సినిమాలో వివేక్ ఒబెరాయ్ మోడి గెటప్ బాగా విమర్శలకు గురైంది. ఆ లుక్ లో వివేక్ ఒబెరాయ్ అటు మోడీలానూ లేడు, ఇటు వివేక్ ఒబెరాయ్ లానూ లేడంటూ నెటిజన్లు ఆటపట్టించారు. ఇప్పుడు జయలలితగా కంగనా పరిస్థితి కూడా అలానే  ఉందని వారంటున్నారు!