రంగస్థలం సినిమా అభిమానులకు ఇది కాస్త షాకింగ్ న్యూస్ నే. సుకుమార్-రామ్ చరణ్ లోని సూపర్ బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. కోటిన్నరకు కాస్త అటు ఇటుగా మొత్తానికి తమిళ రీమేక్ హక్కులను మైత్రీమూవీస్ అధినేతలు ఇచ్చేసినట్లు తెలుస్తోంది.
తమిళ హక్కులు ఇచ్చేయడం పెద్ద వార్త కాదు. లారెన్స్ తీసుకోవడం అన్నది అసలు వార్త. దీంట్లో దర్శకుడు లింగుస్వామి హ్యాండ్ కూడా వుండబోతోంది. అదే కాస్త కంగారు పడవలసిన విషయం. లారెన్స్ అంటే ఎంత మాస్ అన్నది మన జనాలకు తెలిసిందే. ఇక లింగుస్వామి సంగతి కూడా తెలిసిందే.
ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు రంగస్థలం సినిమాను ఏం చేయబోతున్నారు అన్నదే అనుమానం. రంగస్థలం క్లాస్ టచ్ వున్న మాస్ సినిమా. సినిమాలో కనిపించని మాస్ ఎలిమెంట్స్ వుంటాయి. అంతేకానీ, డైరక్ట్ గా మాస్ వాసనలు వుండవు. కానీ లింగుస్వామి, లారెన్స్ సినిమాలు అలావుండవు. రంగస్థలం విజయ్ సేతుపతి, ధనుష్ లాంటి వాళ్లకు సరిపోతుంది. మరి లారెన్స్ ఏం చేస్తారో చూడాలి.