థమన్ ‘జై బాలయ్య’ ఖర్చు..ఓ లెవెల్ లో

అల వైకుంఠపురములో సినిమా నుంచి సంగీత దర్శకుడు థమన్ కు ఓ కొత్త అలవాటు మొదలైంది. తన పాటల ప్రమోషన్ కు తానే కవర్ సాంగ్ లు చేయడం. దాని కోసం లక్షలకు లక్షలు…

అల వైకుంఠపురములో సినిమా నుంచి సంగీత దర్శకుడు థమన్ కు ఓ కొత్త అలవాటు మొదలైంది. తన పాటల ప్రమోషన్ కు తానే కవర్ సాంగ్ లు చేయడం. దాని కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేయించడం. 

అయితే ఇది ఒక విధంగా ప్లస్. సినిమా పాటను విడుదలకు ముందే జ‌నంలోకి బలంగా తీసుకెళ్లడానికి పనికి వస్తుంది. అలా చేయడం వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్ కూడా వస్తుంది.

కానీ ఇక్కడ మైనస్ ఏమిటంటే పెద్ద సినిమాలకు ఓపెనింగ్ తేవడానికి మరీ ఇంతలా ఖర్చు చేయాల్సిన పని లేదు. థమన్ ఒక్కో కవర్ సాంగ్ చేయడానికి అలవైకుంఠపురములో టైమ్ లోనే పాతిక లక్షల వంతున ఖర్చయింది. అదే సర్కారువారి పాట టైమ్ కు మరీ పెరిగింది.

ఇప్పుడు లేటెస్ట్ గా వీరసింహారెడ్డి సినిమా కోసం కూడా కవర్ సాంగ్ లు చేయడం మొదలు పెట్టారు. జై బాలయ్య అనే సాంగ్ కోసం చాలా భారీగా కవర్ సాంగ్ చేయించినట్లు తెలుస్తోంది. దీంతో పైకి ఏమీ అనలేకపోయినా, అంత ఖర్చు ఏమిటి అని నిర్మాతలు ఫీలవుతున్నట్లు బోగట్టా. ఇది ఇక్కడితో అయిపోయేది కాదు. వీరసింహారెడ్డి లో ఇంకా చాలా పాటలు వుంటాయి. ఇంకా చాలా ఖర్చు వుంటుంది.

ఇది చూసి దేవీశ్రీప్రసాద్ కూడా వాల్తేర్ వీరయ్యకు మొదలుపెడితే అది ఇంకో లెవెల్ లో వుంటుంది.