‘భయో’ డేటా: కె.ఎ. ‘వేషాల్’!

నా పేరు: కె. ఎ. పాల్‌ ( కిలారి ఆనంద్‌ పాల్‌.. ‘కిలాడి’ కాదు) Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: తెలంగాణ ముఖ్యమంత్రి..( అంతకు మించి చిన్న పోస్టు చెయ్యను) వయసు: ఏం మునుగోడు క్యాంపెన్‌లో…

నా పేరు: కె. ఎ. పాల్‌ ( కిలారి ఆనంద్‌ పాల్‌.. ‘కిలాడి’ కాదు)

దరఖాస్తు చేయు ఉద్యోగం: తెలంగాణ ముఖ్యమంత్రి..( అంతకు మించి చిన్న పోస్టు చెయ్యను)

వయసు: ఏం మునుగోడు క్యాంపెన్‌లో నా డాన్స్‌ చూడలేదా? రఫ్పాడిరచేశాను. స్వీట్‌ సిక్స్టీన్‌. కాకుంటే డెభ్భయి, ఎనభయ్యేళ్ళ వారిని దీవిస్తూ వుంటాను. ఐ మీన్‌ ‘బ్లెస్‌’ చేస్తుంటాను మోదీజీ, బిడెన్‌ జీ అందరూ నా శిష్యులే.

ముద్దు పేర్లు: కో ‘పాల్‌’, తా ‘పాల్‌’ ’ (పా‘పాల్‌, లో‘పాల్‌’ కాదు.) ఇప్పుడు కె.ఎ. వేషాల్‌ ( రోజుకో వేషం వేస్తున్నాను. కావాలంటే మునుగోడు రండి.)

విద్యార్హతలు:  టెన్త్‌ (ఆనర్స్‌) అంటే రెండు సార్లు తప్పాను. అప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు. ‘తప్పింది’ చాలు.. లే అన్నాడు. లేచాను.

విలాసం: మునుగోడు కారు మీద చెయ్యి ఊపుతున్న ‘రైతు’చూశారా? అది నేనే. (అలాగని, ‘కారు’ గుర్తుకు వోటేశారు.. చెయ్యి ని చూపాను కదా అని ‘చెయ్యి’ గుర్తుకు కూడా వేసి నన్ను ముంచకండి. చేతిని కాదు. చేతి వేలును చూడండి. వేలుకు వున్న ‘ఉంగరాన్ని’ చూడండి. అదీ మన గుర్తు.

గుర్తింపు చిహ్నాలు: ఒకటి: ప్రపంచంలో లక్షలాది ఇవాంజిలస్టులున్నారు. కానీ నేను నవ్వించినట్లు ఎవరూ నవ్వించలేరు. నన్ను చూస్తేనే నవ్వొస్తుంది.

రెండు: కోట్లూ, ఫ్లయిట్లూ… నేను తలుచుకుంటే మునుగోడు ప్రజల అభివృధ్ధి కి దిగిపోతాయి. కాని ఎన్నికల సంఘమే ‘హెలికాప్టర్‌’ ను దిగనివ్వలేదు. ఆ గుర్తు బదులు ఉంగరం ఇచ్చింది.

సిధ్ధాంతం: ‘శాంతి’ ( అవును ‘ప్రజాశాంతి’. నేను శాంతిని బోధిస్తే, ‘తుపాకులు పట్టండి’ అని చిందేసిన గద్దర్‌ కూడా ‘శాంతి’ కాముకుడయిపోతాడు. అయిపోయాడు కూడా. కానీ కేసుల పెడితే ఎక్కడ తట్టుకుంటాడు చెప్పండి..!)

వృత్తి: అన్ని దేశాలనుంచి కోట్లు తెచ్చి తెలుగు రాష్ట్రాలను డెవలప్‌ చెయ్యటం. కానీ తేనివ్వరే..!?

హాబీలు: 1. టీవీ ఇంటర్వ్యూలిచ్చే పేరు మీద ‘యాంకర్ల’ను ప్రశ్నించటం

2. ఓడిపోతానని తెలిసి కూడా ఎన్నికల్లో పోటీ చెయ్యటం.

అనుభవం: ఎవరి మీడియాలోనయినా నేను ఉచిత ప్రచారం పొందుతాను. నేను కనిపిస్తే జనం ఎగబడి చూస్తారని టీవీ కెమెరాలు నా వెంటపడతాయి.

మిత్రులు: రామ్‌ గోపాల వర్మ. ఆ విషయం అతనికి కూడా తెలియదు. లేక పోతే నాకు తన సొంత శ్రమ మీద నాకు ఎందుకు ప్రచారం కల్పిస్తాడు.

శత్రువులు: ఉండరు. నేను ఎంత తిట్టినా నవ్వుకుని పోతారు. ఎందుకంటే నేను శత్రువుల్ని ప్రేమిస్తాను. నా వల్ల వాళ్ళకి వోట్లు వచ్చేలా చేస్తాను.

మిత్రశత్రువులు: ఇదుగో ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళే మిత్రశత్రువులు.

జీవిత ధ్యేయం: నేనేమీ దాచుకోను. ప్రపంచంలో అన్ని దేశాలనుంచి డబ్బు తెచ్చి ఇండియాలో ఖర్చు పెట్టటమే నా జీవిత ధ్యేయం.

సర్‌