చంద్రబాబే తన ఇంటికి వెళ్లొచ్చు కదా!

చంద్రబాబు నాయుడు ఇంటిని వరద చుట్టుముట్టలేదు, ఆయన ఇళ్లు చాలా సేఫ్ గా ఉంది, చంద్రబాబు నాయుడు ఇంటిని వరద చుట్టుముట్టిందని చెప్పడానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాట్లు పడుతూ ఉంది.. అనేది…

చంద్రబాబు నాయుడు ఇంటిని వరద చుట్టుముట్టలేదు, ఆయన ఇళ్లు చాలా సేఫ్ గా ఉంది, చంద్రబాబు నాయుడు ఇంటిని వరద చుట్టుముట్టిందని చెప్పడానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాట్లు పడుతూ ఉంది.. అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ల వాదన. నదీ ఒడ్డుకు ఆనుకుని నిర్మించిన అక్రమ కట్టడంలో చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో, ఇదే సమయంలో కృష్ణకు భారీ వరద వచ్చిన పరిణామాల్లో టీడీపీ వాళ్లు ఇలా మాట్లాడుతూ ఉన్నారు.

అయితే కృష్ణకు భారీ వరద రావడంతో సహజంగానే కరకట్ట మీది నివాసంలోకి నీరు వస్తోందని స్పష్టం అవుతోంది. అయితే ఈ వాదనను తెలుగుదేశం పార్టీ ఒప్పుకోవడం లేదు. మరి ఇంతకీ ఎవరు రైటు? ఎవరు తప్పు? అంటే.. అది తేల్చడం చంద్రబాబు నాయుడుకే సులభం.

అదెలాగంటే.. తను కరకట్ట నివాసంలోకి ఇప్పుడు వెళ్లడం ద్వారా చంద్రబాబు నాయుడు అసలు విషయాన్ని చాటి చెప్పవచ్చు. తను ఉంటున్న ఇంటికి వరద ముప్పులేదని తేల్చాలంటే తనే ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్లాలి. వరద మొదలుకాగానే ఆయన ఆ ఇంటిని ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. ఫస్ట్ ఫ్లోర్ లోని వస్తులను తీసి రెండో అంతస్తుకు తరలించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ని కూడా అక్కడ నుంచి తరలించారట.

కరకట్ట ఇంటిని వరద చుట్టుముట్టడంతో చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారని అంటున్నారు. అసలు వరదే లేదు అని టీడీపీ వాళ్లు అంటున్నారు. ఈ పరిణామాల్లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను వీడి.. తిరిగి కరకట్టను చేరుకుంటే అప్పుడు వరద లేదని స్పష్టత వస్తుంది. తన అద్దె ఇంటిని, అక్రమ నిర్మాణాన్ని వరద చుట్టుకోలేదు అని నిరూపించడానికి అయినా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అక్కడకు చేరుకోవాలి.

హైదరాబాద్ ను వీడి మళ్లీ అక్కడకు వెళ్లాలి. అప్పుడు విమర్శలు చేసే వాళ్లకు అవకాశం ఉండదు. అయితే చంద్రబాబు నాయుడు 'ఆ ఒక్కటీ అడక్కు' అంటున్నారట! వరద భయంతో చంద్రబాబు ఆ ఇంటికి వెళ్లరు, హైదరాబాద్ లోనే ఉంటారు, అయితే ఆ ఇంటిని వరద చుట్టుకోలేదని మాత్రం అందరూ ఒప్పుకోవాలి. అంతవరకూ తెలుగుదేశం పార్టీ వాళ్లు యాగీ చేస్తూనే ఉంటారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రణరంగం సినిమాపై ప్రేక్షకులు ఏమన్నారంటే