అనుష్కతో ఎఫైర్.. ప్రభాస్ ఘాటు స్పందన!

'సాహో' సినిమా విడుదలకు రెడీ అవుతున్న తరుణంలో ప్రభాస్ – అనుష్కా షెట్టిల మధ్య ఎఫైర్ రూమర్స్ మళ్లీ ఊపందుకున్నాయి. వీరిద్దరూ కలిసి ఉండటానికి అమెరికాలో ఒక లవ్ నెస్ట్ ను వెదుకుతున్నారని, జపాన్…

'సాహో' సినిమా విడుదలకు రెడీ అవుతున్న తరుణంలో ప్రభాస్ – అనుష్కా షెట్టిల మధ్య ఎఫైర్ రూమర్స్ మళ్లీ ఊపందుకున్నాయి. వీరిద్దరూ కలిసి ఉండటానికి అమెరికాలో ఒక లవ్ నెస్ట్ ను వెదుకుతున్నారని, జపాన్ కు హాలిడే వెళ్తున్నారని, ఇప్పటికే ‘సాహో’ స్పెషల్ షోను అనుష్క కోసం ప్రభాస్ ఏర్పాటు చేశాడనేవి తాజా రూమర్లు. ప్రభాస్ కు త్వరలో పెళ్లి చేస్తామన్న కృష్ణంరాజు వ్యాఖ్యలను ఉటంకిస్తూ  మీడియా ఈ రూమర్లను వ్యాపింపజేస్తూ ఉంది. ప్రభాస్ పెళ్లి అనుష్కతోనే అన్నట్టుగా రూమర్లు సాగుతూ ఉన్నాయి.

ఇలాంటి నేఫథ్యంలో 'ముంబై మిర్రర్' ఈ వ్యవహారంపై ఒక కథనాన్ని ఇచ్చింది. అనుష్కతో ఎఫైర్, ప్రస్తుత గాసిప్స్ గురించి ప్రభాస్ తో ఆరాతీసిందట ఆ మీడియా సంస్థ. ఆ అంశంపై స్పందిస్తూ ఆ కథనాలను పూర్తిగా ఖండించాడట ప్రభాస్. అనుష్కతో తన ఎఫైర్ అనేది కేవలం ఊహాగానమే అని ప్రభాస్ తేల్చి చెప్పినట్టుగా సమాచారం. 

గత రెండేళ్ల నుంచి తాము కలిసింది కూడా లేదని ప్రభాస్ తేల్చిచెప్పాడట. ఒకవేళ తామిద్దరి మధ్యనా ఏదైనా ఎఫైర్ నడుస్తూ ఉంటే ఎక్కడో ఒకచోట కలిసేవాళ్లం కదా? అని ప్రభాస్ ప్రశ్నించాడట. తామెక్కడా కనీసం కలిసి కనిపించనప్పుడు కూడా ఇలాంటి రూమర్లకు అర్థం ఏముందని ప్రభాస్ ప్రశ్నించాడట. ఈ మేరకు ఆ పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది.