రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే శర్వాతో!

'రణరంగం' కథను తను ముందుగా రవితేజ కోసం తయారు చేసుకున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు సుధీర్ వర్మ. రవితేజకు ఆ సినిమా కథను వివరించినట్టుగా అయితే ఆయనతో చేయలేకపోయినట్టుగా ఈ దర్శకుడు చెప్పాడు. రవితేజకు ఆ…

'రణరంగం' కథను తను ముందుగా రవితేజ కోసం తయారు చేసుకున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు సుధీర్ వర్మ. రవితేజకు ఆ సినిమా కథను వివరించినట్టుగా అయితే ఆయనతో చేయలేకపోయినట్టుగా ఈ దర్శకుడు చెప్పాడు. రవితేజకు ఆ కథ నచ్చినా ఆ సినిమా పట్టాలెక్కలేదని, దీంతో శర్వానంద్ తో చేస్తున్నట్టుగా ఈ దర్శకుడు చెప్పాడు. ఆ విషయాన్ని రవితేజకు చెప్పామని, రవితేజ కూడా ఓకే చెప్పాడని.. అలా ఈ శర్వానంద్ తో ఈ సినిమా మొదలైందని సుధీర్ వర్మ అన్నాడు.

ఈ సినిమాకు ముందుగా 'దళపతి' అనే టైటిల్ ను అనుకున్నట్టుగా, అయితే అది వేరే వాళ్లు రిజిస్టర్ చేయించుకోవడంతో 'రణరంగం' అని టైటిల్ ఖరారు చేసినట్టుగా చెప్పాడు. ఈ సినిమా ప్రారంభం అయ్యి ఏడువందల రోజులు గడిచాయని, అయితే షూటింగ్ జరిగింది మాత్రం డెబ్బై రోజులు మాత్రమే అని ఈ దర్శకుడు చెప్పాడు. బడ్జెట్ ఎంత అయ్యిందో కూడా తనకు తెలియదన్నాడు.

హీరోయిన్ కాజల్ పాత్రకు ప్రాధాన్యత తక్కువే అని అన్నాడు.  ఈ సినిమాను తను 'గాడ్ ఫాదర్ 2' నుంచి స్ఫూర్తి పొందినట్టుగా వివరించాడు. ఇప్పటికే గాడ్ ఫాదర్ కాన్సెప్ట్ ను స్ఫూర్తి పొంది, కాపీ కొట్టి.. బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా ఆ కోవకు చెందినదే అని స్వయంగా దర్శకుడే ప్రకటించాడు.

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడం లేదు!