వెళ్తున్నారా? పంపిస్తున్నారా?

తెలుగుదేశం నుంచి భాజపాకు వలసలు కొనసాగుతున్నాయి. 'దేశా'న్ని వీడి భాజపాలోకి వెళ్తున్న జనాలను చూస్తుంటే, వీళ్లు నిజంగానే వెళ్తున్నారా? లేక కావాలని పంపిస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేటెస్ట్ గా కిందస్థాయి నాయకులు ఇద్దరు…

తెలుగుదేశం నుంచి భాజపాకు వలసలు కొనసాగుతున్నాయి. 'దేశా'న్ని వీడి భాజపాలోకి వెళ్తున్న జనాలను చూస్తుంటే, వీళ్లు నిజంగానే వెళ్తున్నారా? లేక కావాలని పంపిస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేటెస్ట్ గా కిందస్థాయి నాయకులు ఇద్దరు భాజపా తీర్థం తీసుకున్నారు.

టీడీపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వర్రావు, భాజపాలో చేరారు. చందు సాంబశివరావు చిరకాలం దేశం మీడియా విభాగం వ్యవహారాలు కూడా చూసారు. పార్టీ మీడియా వ్యవహారాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. అలాగే సిద్దా వెంకటేశ్వరరావు పదవీ వైభోగం అనుభవించారు.

ఇలాంటి వారంతా పార్టీ కష్టాల్లోకి చేరుకుని గట్టిగా రెండునెలలు కాకుండానే చంద్రబాబును వదిలేసి వెళ్తున్నారంటే, వీరికి నిజంగా బాబు మీద ప్రేమ వుండే ఇన్నాళ్లూ పార్టీలో వున్నారా? లేక అధికార పార్టీ అని అంటిపెట్టుకుని వున్నారా? అన్న అనుమానం కలుగుతోంది.

ఇప్పుడు అధికారం వున్న పార్టీ అని భాజపా వైపు వెళ్తున్నారా? లేక ఇక్కడ ప్రస్తుతానికి చేసేందేంలేదు, ఒక నాలుగేళ్లు అక్కడ వుండి రండి అని బాబే పంపిస్తున్నారా? అన్న అనుమానాలు కూడా వుండనే వున్నాయి. అనుమానాల సంగతి అలా వుంచితే మళ్లీ ఎన్నికల వేళకు తెలుగుదేశం పరిస్థితి బాగుంటే ఇలా వెళ్లిన వాళ్లంతా రిటర్న్ టికెట్లు కొనుక్కుని రావడం ఖాయం. వాళ్లను చేర్చుకోవడం ఖాయం.

ఎందుకంటే ఇలా వెళ్లిన వాళ్లలో ఎక్కువ మంది తెలుగుదేశంలోని కీలక సామాజిక వర్గానికి చెందిన నాయకులే కాబట్టి. వారికి ఎప్పుడూ పార్టీ తలుపులు తెరిచే వుంటాయి.

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?