విలన్ గా రఘు కుంచే

యాంకర్ గా, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రఘు కుంచే తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు.. ఓ డిఫరెంట్ సినిమాగా రూపొందుతుంన్న ‘‘పలాస 1978’’లో…

యాంకర్ గా, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రఘు కుంచే తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు.. ఓ డిఫరెంట్ సినిమాగా రూపొందుతుంన్న ‘‘పలాస 1978’’లో రఘు కుంచే విలన్ గా కనిపించబోతున్నారు. అది కూడా సాదా సీదా విలన్ పాత్ర కాదు. నాలుగు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించే విలన్ పాత్ర .

‘‘పలాస 1978’’కు రఘు కుంచే మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుండటం మరో విశేషం. ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్ కు,రఘు విలన్ పాత్రకు సూటవుతారని ఫిక్స్ చేశారు.. ఈ క్యారెక్టర్ లో నాలుగు డిఫరెంట్ ఏజ్ లు చూపించే పాత్రను రఘు చేస్తున్నారు. ఈ సినిమాలో 30-40-50-70 ఏజ్ లలో అతను కనపించబోతున్నారు.

రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘‘పలాస 1978’’  చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటున్నారు దర్శక నిర్మాతలు.

దొరసాని మనసెరిగిన దొర.. ఏమి చెప్పాడో తెలుసా?