బాలీవుడ్ లో మరో డేటింగ్ వ్యవహారం బయటపడింది. యూరి సినిమాతో పాపులర్ అయిన విక్కీ కౌశల్ ఈసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. హీరోయిన్ మాళవిక మోహనన్, విక్కీ కౌశల్ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ సరసన హీరో అనే సినిమాలో నటిస్తోంది. నిజానికి విక్కీ కౌశల్ కు ఇది తొలిప్రేమ కాదు. మాళవిక పరిచయం అవ్వకముందు మరో అమ్మాయితో డేటింగ్ లో ఉండేవాడు ఈ కుర్రహీరో.
మాళవిక పరిచయం అవ్వడం, యూరి సినిమా హిట్ అవ్వడం ఒకేసారి జరగడంతో ఆమెను లక్కీగా ఫీలవుతున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ప్రతిరోజు సాయంత్రాలు కలుసుకుంటున్నారు. దాదాపు 6-7 నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నప్పటికీ ఎక్కడా బయటకు పొక్కలేదు. చివరకు ఓ హీరోయిన్ వల్ల ఈ మొత్తం వ్యవహారం బయటకొచ్చింది.
ఆమె మరెవరో కాదు రాధికా ఆప్టే. చాలా విషయాలపై ఓపెన్ గా మాట్లాడే రాధికా ఆప్టే… విక్కీ-మాళవిక ఎఫైర్ ను బయటపెట్టింది. తన తమ్ముడు కూడా మాళవికకు బాగా క్లోజ్ కాబట్టి విక్కీ-మాళవిక ఎఫైర్ గురించి తనకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తుంటాయని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
ఓ టీవీ షోలో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ బయటపెట్టేసింది రాధికా ఆప్టే. ఇకనైనా విక్కీ-మాళవిక తమ ఎఫైర్ ను పబ్లిక్ గా ఒప్పుకోవాలని, అలా చేయడం వల్ల పుకార్లు రాకుండా ఉంటాయని ఓ ఉచిత సలహా కూడా పడేసింది. కాస్టింగ్ కౌచ్ లాంటి చాలా విషయాలపై బోల్డ్ గా మాట్లాడే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడిలా జంటల ఎఫైర్లను కూడా బయటపెట్టడం మొదలుపెట్టిందన్నమాట.