సమంతకు ఆ అదృష్టం దక్కింది-రానా

అక్కినేని కుటుంబానికి కోడలు సమంత. అంతే కాదు, ఇండస్ట్రీలో మరో బిగ్ ఫ్యామిలీ దగ్గుబాటి వారికీ బంధువే. దగ్గుబాటి బ్రదర్స్ కు కూతురు కాని కూతురు అన్నమాట. అయితే అటు దగ్గుబాటి రామానాయడు మనవులు…

అక్కినేని కుటుంబానికి కోడలు సమంత. అంతే కాదు, ఇండస్ట్రీలో మరో బిగ్ ఫ్యామిలీ దగ్గుబాటి వారికీ బంధువే. దగ్గుబాటి బ్రదర్స్ కు కూతురు కాని కూతురు అన్నమాట. అయితే అటు దగ్గుబాటి రామానాయడు మనవులు చైతూ కి, రానా కు కానీ, కొడుకు వెంకటేష్ కు కానీ దక్కని అదృష్టం సమంతకు దక్కింది. ఈ విషయం రానానే చెప్పాడు.

ఈ ఏడాదితో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ యాభై ఏళ్ల మైలురాయిని దాటబోతోంది. ఈ సందర్భంగా నిర్మించిన సినిమా ఓబేబీ. అయితే తమ సంస్థ యాభై ఏళ్లు పూర్తెయిన సందర్భంగా తమ నిర్మాణంలో వస్తున్న సినిమా పోస్టర్ మీద బాబాయ్ వెంకటేష్ ఫోటో కానీ, తన ఫోటో కానీ, చైతన్య ఫోటో కానీ లేదని, సమంతకు మాత్రమే ఆ అదృష్టం దక్కిందని అన్నారు.

అది కూడా నిజమే. అంతే కాదు, వాస్తవం మాట్లాడుకొవాలంటే ఇవ్వాళ్ల దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీల్లో సమంత కు వున్న క్రేజ్ ఎవరికీ లేదు. అటు నాగ్, చైతూలు కానీ, ఇటు రానా, వెంకటేష్ లు కానీ ప్రస్తుతం సమంత కు వున్న క్రేజ్ ను బీట్ చేయలేరు. కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయినా ఓ బేబీకి విపరీతమైన క్రేజ్ వస్తోంది అంటే కారణం సమంతనే కదా.