నాన్నని అక్కౌంట్స్ సరిగ్గా చెప్పమను

సినిమా ఫంక్షన్ లలో పెద్ద సెలబ్రిటీలు వస్తే చనువుగా మాట్లాడడం మామూలే కానీ, ఒక్కోసారి ఆ మాటలు ఎక్కడో ఎవరికో తగులుతుంటాయి. ఓ బేబీ సినిమా ఫంక్షన్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వేసిన ఓ…

సినిమా ఫంక్షన్ లలో పెద్ద సెలబ్రిటీలు వస్తే చనువుగా మాట్లాడడం మామూలే కానీ, ఒక్కోసారి ఆ మాటలు ఎక్కడో ఎవరికో తగులుతుంటాయి. ఓ బేబీ సినిమా ఫంక్షన్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వేసిన ఓ చెణుకు అలాంటిదే.

రాఘవేంద్రరావు ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో అన్ని విధాలా పెద్దాయిన. ఓ బేబీ సినిమాకు కీలకమైన నిర్మాత సురేష్ బాబుకు కానీ, సమంత అక్కినేని ఫ్యామిలీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఆయన వారి గురించి ఎలాగైనా మాట్లాడగలరు.

ఓ బేబీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ తాను సినిమా చూసానని, చాలా బాగుందని,  నలుగురు నిర్మాతలు కాబట్టి, అందరికీ మాంచి లాభాలు వస్తాయని అంటూ, సురేష్ బాబు లెక్కలు సరిగ్గా చెప్పాలని అన్నారు. అక్కడితో ఆగకుండా, అక్కడే వున్న రానా ను ఉద్దేశించి, 'రానా, డాడీకి చెప్పు అక్కౌంట్స్ సరిగ్గా చెప్పమని, అసలే సరిగ్గా చెప్పడు. నా వంతు వాటా కూడా వుంది' అని అన్నారు. 

అసలే ఇండస్ట్రీలో ఓ జనరల్ టాక్ వుంది. సురేష్ మూవీస్ కు సినిమా ఇస్తే లెక్కలు సరిగ్గా చెప్పరు అని. అది నిజమో, కాదో కానీ ఆ జనరల్ టాక్ అయితే వుంది. ఇలాంటి నేపథ్యంలో రాఘవేంద్రరావే పబ్లిక్ గా ఇలా అనడంతో, ఇకపై ఆ టాక్ మరింత బలంగా వినిపిస్తుందేమో?