అడ్డగోలు విమర్శలు ఆపి ఇటు చూడు బాబు!

కరోనాకు మందు లేదు. ఎవరైనా పారాసిట్మాల్ వేసుకోవాల్సిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రారంభంలో జగన్ చెప్పిన ఈ మాటలను ఎంత కామెడీ చేయాలో అంతా చేశారు చంద్రబాబు. టీడీపీ సోషల్ మీడియా వింగ్…

కరోనాకు మందు లేదు. ఎవరైనా పారాసిట్మాల్ వేసుకోవాల్సిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రారంభంలో జగన్ చెప్పిన ఈ మాటలను ఎంత కామెడీ చేయాలో అంతా చేశారు చంద్రబాబు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ అయితే ఎన్ని మీమ్స్ చేసిందో లెక్కలేదు. ఇక చంద్రబాబు అయితే ఈ పారాసిట్మాల్ టాపిక్ చుట్టూనే బోలెడన్ని వీడియో కాన్ఫరెన్సులు పెట్టారు. కట్ చేస్తే, ఆ తర్వాత ప్రపంచం మొత్తం పారాసిట్మల్ తోనే ట్రీట్ మెంట్ స్టార్ట్ చేసింది. దాని తర్వాత హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుల్ని వాడడం మొదలుపెట్టింది. దీంతో బాబు నోటికి మూతపడింది.

తాజాగా ఇప్పుడు మరోసారి జగన్ వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టిస్తూ సెటైర్లు అందుకుంది టీడీపీ. రాబోయే రోజుల్లో కూడా కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంటుందని జగన్ అన్నారు. దీంతో టీడీపీ వింగ్ రెచ్చిపోయింది. కరోనాతో సహజీవనం, కరోనాతో పెళ్లి అంటూ రకరకాల కార్టూన్లు చేసి వదిలింది. అటు చంద్రబాబు కూడా జగన్ ఇలాంటి స్టేట్ మెంట్ ఎలా ఇస్తారంటూ విమర్శలు చేశారు. జగన్ ఫెయిల్ అయ్యారంటూ అడ్డగోలు విమర్శలు చేశారు.

కట్ చేస్తే, ఇప్పుడు బాబు నోటికి మరోసారి తాళం పడింది. ఈసారి కూడా ప్రపంచమంతా జగన్ చెప్పిన మాటనే చెబుతోంది. కరోనా కొన్నేళ్ల పాటు మనతోనే ఉంటుందని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ సంస్థకు చెందిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ఈ విషయాన్ని కుండబద్దలుకొట్టారు. అటు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కరోనాతో కలిసి జీవించక తప్పదని అన్నారు.

ఇదే మాటను ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు కూడా చెబుతున్నాయి. కరోనాను పూర్తిగా అంతమొందించామని చెబితే అది భ్రమే అవుతుందన్నారు. తమ దేశం నుంచి కరోనాను తరిమికొట్టడానికి కనీసం ఐదేళ్లయినా పడుతుందని స్వయంగా ఆ దేశ ప్రభుత్వాలు ప్రకటించాయి.

అంతెందుకు.. నిన్నటికి నిన్న పొరుగునే ఉన్న తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. కరోనాను ఇప్పటికిప్పుడు నిర్మూలించడం సాధ్యం కాదని, కొన్ని జాగ్రత్తలతో దానితో కలిసి జీవించాల్సిందేనని అధికారులు ప్రకటించారు. కరోనా కేసులు తగ్గిన తర్వాత కూడా ప్రతి జిల్లా హాస్పిటల్ లో ఐసోలేషన్ వార్డులు కొనసాగించాలని నిర్ణయించారు.

ఇలా ప్రపంచం మొత్తం జగన్ చెప్పిన మాటనే రిపీట్ చేసిన వేళ.. బాబుకు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. మొన్నటివరకు జగన్ కు అడ్మినిస్ట్రేషన్ రాదని, కరోనా విషయంలో పూర్తిగా ఫెయిలయ్యారని అవాకులు చెవాకులు పేలిన చంద్రబాబు.. ఇప్పుడు కామ్ గా ఇంట్లో కూర్చున్నారు. మరో అవకాశం కోసం ఆబగా ఎదురుచూస్తున్నారు. తాము చేసిన విమర్శల్లో పసలేదని తేలిపోవడంతో టీడీపీ సోషల్ మీడియా వింగ్ మొత్తం ఎక్కడికక్కడ సర్దుకుంది.

జగన్ గారు చెప్పింది మూర్ఖులకు అర్ధం కావట్లేదు