బిగ్ బాస్ ప్రకటనల్లో నాగ్ బిజీ

బిగ్ బాస్ 3 హోస్ట్ సీట్ లోకి నాగ్ వచ్చేసాడు. సీజన్ లైవ్ స్టార్ట్ కావాల్సి వుంది. బ్యాకెండ్ వర్క్ జరుగుతోంది. పార్టిసిపెంట్స్ వేట కొనసాగుతోంది. మరోపక్క ప్రోగ్రామ్స్ ప్రమోషన్స్ కు ఏర్పాట్లు మొదలయ్యాయి.…

బిగ్ బాస్ 3 హోస్ట్ సీట్ లోకి నాగ్ వచ్చేసాడు. సీజన్ లైవ్ స్టార్ట్ కావాల్సి వుంది. బ్యాకెండ్ వర్క్ జరుగుతోంది. పార్టిసిపెంట్స్ వేట కొనసాగుతోంది. మరోపక్క ప్రోగ్రామ్స్ ప్రమోషన్స్ కు ఏర్పాట్లు మొదలయ్యాయి. మాటీవీ ఆధ్వర్యంలో ఇందుకోసం ప్రకటనలు రూపొందిస్తున్నారు. రెండు మూడు రకాల ప్రోమోలు తయారవుతున్నాయి. వీటిని పిక్చరైజ్ చేసే పని జోరుగా సాగుతోంది.

మన్మధుడు 2 వర్క్ ఫినిష్ చేసిన హీరో నాగార్జున ఇప్పుడు ఈ ప్రోమోల వర్క్ మీదకు వచ్చేసాడు. వీటిల్లో ఒక ప్రోమోను డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ తయారుచేస్తున్నారు. గతంలో కూడా ఆయన మాటీవీ కోసం నాగ్ తో ఓ ప్రకటన రూపొందించారు. ఇప్పుడు బిగ్ బాస్ కోసం కూడా ఓ ప్రోమో బాధ్యతను కళ్యాణ్ కృష్ణకు అప్పగించారు.

సోమవారం నుంచి ఆ పని షురూ అయింది. ఇదిలావుంటే జూలై చివరి నుంచి బంగార్రాజు సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లే పనుల్లో వుంది ఆ సినిమా యూనిట్. 

బాబు అప్పుడే ఇలా ఆలోచించి ఉంటే ఫలితముండేదేమో!