రామోజీ బోధ : భాజపాకు జై కొడితే బెటర్!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఈనాడు అధినేత రామోజీరావును బుధవారం కలిశారు. హెలికాప్టర్ లో రామోజీ ఫిలింసిటీకి వెళ్లిన చంద్రబాబు… విందు సహా, ఆయనతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. సమకాలీన రాజకీయాలను చర్చించారు. రామోజీరావు…

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఈనాడు అధినేత రామోజీరావును బుధవారం కలిశారు. హెలికాప్టర్ లో రామోజీ ఫిలింసిటీకి వెళ్లిన చంద్రబాబు… విందు సహా, ఆయనతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. సమకాలీన రాజకీయాలను చర్చించారు. రామోజీరావు నివాసానికి సమీపంగా ఉండే హెలిపాడ్ వద్ద రామోజీరావు, ఆయన కుమారుడు కిరణ్.. చంద్రబాబుకు స్వాగతం పలికి తీసుకువెళ్లారు. ఇదంతా ఓకే… మరో వారంరోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో… చంద్రబాబునాయుడు- రామోజీరావు భేటీ వెనుక మతలబు ఏంటి?

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి..
భాజపా ప్రేరేపణతోనే ఈ ‘రామోజీ-బాబు’ భేటీ ఏర్పాటు అయినట్లు తెలుస్తోంది. రామోజీరావు సాధారణంగా నరనరాన కాంగ్రెసు వ్యతిరేకత నిండినవ్యక్తి. పైగా పలు సమీకరణాల నేపథ్యంలో ఆయన భాజపా అగ్ర నాయకత్వంతో చాలా సన్నిహితంగా ఉంటారనే పేరుంది. అయితే… తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబునాయుడు… కొంతకాలంగా భాజపాపై కత్తులు నూరుతున్నారు. మోడీని విలన్ గా చిత్రీకరిస్తూ చెలరేగిపోతున్నారు. మోడీ విలనీ- ఈ ఎన్నికల్లో తనను గట్టెక్కిస్తుందని కూడా ఆయన ఉబలాటపడుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో రామోజీ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఎటూ ఎన్నికల్లో మోడీ వ్యతిరేకతతో ప్రజల్ని బురిడీ కొట్టించే పర్వం ముగిసింది గనుక… ఇకనైనా భాజపా అనుకూలతను అందిపుచ్చుకోవాల్సిందిగా రామోజీ ద్వారా చంద్రబాబుకు సందేశం అందినట్లు సమాచారం. ఈ ఎజెండాతో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు ముక్తాయింపుగా బుధవారం వారి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాలకు సంబంధించి… జగన్ ఎటూ తమకు అనుకూలంగా ఉండగా, అటు చంద్రబాబు అనుకూలతను కూడా సంపాదించుకుంటే కేంద్రంలో తిరిగి సర్కారు ఏర్పడడానికి ఆటంకం ఉండదని భాజపా భావిస్తున్నట్లు సమాచారం.

అయితే చంద్రబాబు ఇన్నాళ్లు తిట్టిన మోడీ పట్ల మళ్లీ భజన ఎలా చేయగలరు? ఎన్డీయే ప్రభుత్వం రాగల పరిస్థితి వస్తే.. మోడీ-యేతర సర్కారు ఏర్పడేట్లయితే చంద్రబాబు మద్దతు ఇవ్వవచ్చు. తదనుగుణంగా ఆయన మంగళవారం నాడే కొన్ని సంకేతాలు ఇచ్చారు. అలా కాని పక్షంలో సంక్లిష్ట పరిస్థితి ఏర్పడితే గనుక.. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఎక్కడానికి చంద్రబాబు చురుగ్గా వ్యవహరించకుండా ఉండేలా కోరడానికే రామోజీ ద్వారా ఈ సమావేశం ఏర్పాటైందని తెలుస్తోంది. అందుకు తగిన ప్రతిఫలం చంద్రబాబుకు ఉంటుందని దానికి సంబంధించిన డీల్ మొత్తం రామోజీ ద్వారా భాజపా తెలియజేయదలచుకున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!