Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆర్ ఎఫ్ సి..లో ఏం జరిగింది?

ఆర్ ఎఫ్ సి..లో ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆపద్భాంధవ ముఖ్యమంత్రి చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి ఏల రావలె? మీడియా టైకూన్ రామోజీరావును ఏల కలవవలె? ఇద్దరి మధ్య అర్జెంట్ గా లంచ్ మీటింగ్ సారాంశమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం అంత సులువుకాదు. ఎందుకంటే ఆర్ ఎఫ్ సిలోకి మీడియాకు అనుమతి వుండదు. పైగా బాబుగారు ఒక్కరే వచ్చారు. భోజనం చేసారు. ఓ గంట ముచ్చటించుకున్నారు, వెళ్లిపోయారు. ఇదీ వినిపిస్తున్న సంగతి.

మరి ఈ గంట ముచ్చటేమిటి? ఇప్పుడు భోజనం మీటింగ్ అకేషన్ ఏమిటి? అసలు మీటింగ్ ఫోటోలు కానీ వార్తలు కానీ ఈనాడు వెబ్ సైట్ లో ఎందుకు లేవు? ఎంత ప్రయివేట్ మీట్ అయినా వుండాలి కదా? రామోజీ మనవరాలి పెళ్లి ప్రయివేటు వేడుకే. కానీ వెబ్ సైట్ లో ప్రింట్ లో బోలెడు ఫొటోలు వచ్చాయి కదా?

ఇప్పటివరకు ఇదెందుకు రాలేదు? అంత రహస్యమేమిటి? ఎన్నికలు అయిపోయాయి. కౌంటింగ్ ఎనిమిది రోజుల దూరంలో వుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? ఏమిటీ వ్యూహరచన? ఇలా చాలా ప్రశ్నలే. సమాధానాలు మాత్రం తెలియవు. ఒక్కటే తెలిసిన విషయం. రామోజీ పిలిచారో? బాబు వస్తా అన్నారో? మొత్తానికి ఓ లంచ్ మీటింగ్ జరిగింది. అంతే.

ఓడిపోతే రెడ్డిగారికి రాజకీయ రిటైర్మెంటేనా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?