అంతా రూల్స్ ప్రకారమే-జీవిత

మా అసోసియేషన్ లో తాము అంతా నిబంధనల ప్రకారమే చేస్తున్నామని సంఘ కార్యదర్శి, నటి జీవిత అన్నారు. మా సంఘ డబ్బులతో ప్రభుత్వ పథకాలతో ప్రకటనలు చేయించారనే ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తామేమీ నిబంధనలు…

మా అసోసియేషన్ లో తాము అంతా నిబంధనల ప్రకారమే చేస్తున్నామని సంఘ కార్యదర్శి, నటి జీవిత అన్నారు. మా సంఘ డబ్బులతో ప్రభుత్వ పథకాలతో ప్రకటనలు చేయించారనే ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తామేమీ నిబంధనలు తోసిరాజని చేయలేదని, అంతా రూల్స్ ప్రకారమే చేసామని, కార్యవర్గంలో అందరికీ ఈ విషయం తెలుసు అని ఆమె అన్నారు. ఇంకెవరికి అయినా సందేహాలు వుంటే ఆఫీసుకు వస్తే రూల్ ఫొజిషన్ చూపించి, వివరణ ఇస్తా అన్నారు.

ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి తదితర పథకాలు పేదవారు, అర్హులైన సభ్యులు వుంటే మా సంఘంలో వారికి కూడా అదేలా చేస్తామని హామీ ఇచ్చిందని, అందుకే తమ వంతుగా ఆ మంచి పథకాలకు ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. చాలా తక్కువ ఖర్చుతో ఏడున్నర లక్షలతో ప్రకటనలు రూపొందిచామన్నారు. అలాంటి టైమ్ లో అధ్యక్షుడు నరేష్ వేరేచోట వుండడంతో, ప్రకటనలు చేసిన వారికి తాను క్యాష్ అడ్జస్ట్ చేసానని జీవిత వివరించారు.

అందువల్ల మళ్లీ ఆ మొత్తాన్ని మా నుంచి తీసుకున్నామన్నారు. ఇంత తక్కువ మొత్తానికి ఎవ్వరూ ప్రకటనలు చేయించలేరని వివరించారు. ప్రకటనలు చేయించడం అస్సలు ఎంతమాత్రం నిబంధనలు అతిక్రమించడం కాదని ఆమె సష్టంచేసారు. సభ్యుల కోసం ప్రభుత్వం నుంచి సహాయం పొందాలనుకున్నపుడు, తమవంతు కృతజ్ఞతతో చేసాం తప్ప వేరుకాదని ఆమె వివరించారు.

పాత విషయాలు మరిచి, అందరూ కలిసి ముందుకు పోదామని అనుకున్నపుడు, మళ్లీ మీడియాకు ఇలా ఫీలర్లు వదిలి, కంపుచేసే ప్రయత్నం సరికాదని జీవిత రాజశేఖర్ అన్నారు. 

భారీస్థాయిలో పోలింగ్ అధికార పార్టీలను గద్దెదించింది