చైనీయుల విపరీత ధోరణులే కరోనా వైరస్ సృష్టికి కారణమయ్యాయనే వాదనలకు బలం చేకూరుతోంది. చైనాలో కరోనా జన్మ వృత్తాంత రహస్యం బయటపడింది. చైనాలోని వుహాన్ నగరంలో గబ్బిలం మాంసం తిన్న వ్యక్తి నుంచి కొవిడ్ 19 వైరస్ పుట్టి….అది ప్రపంచమంతా వ్యాపిస్తూ, లక్షల సంఖ్యలో మనుషుల ప్రాణాలను హరిస్తోంది. అలాగే అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్ప కూలుస్తోంది. ఈ వైరస్ ఎప్పటికి అంతమవుతుందో దిక్కు తెలియక దేశాలకు దేశాలే జుట్టు పీక్కుంటున్నాయి.
చైనాలో అడవి జంతువుల మాంసం పేదలకు అందని ద్రాక్షే. ఎందుకంటే అది చాలా ఖరీదైంది. అడవి జంతువుల మాంసాన్ని బాగా డబ్బున్న వాళ్లు మాత్రమే కొంటారు. దీనికి బాగా డిమాండ్ ఉండటం వెనుక ప్రత్యేక కారణం లేకపోలేదు. అడవి జంతువుల మాంసం తింటే సెక్స్ సామర్థ్యం బాగా పెరుగుతుందని చైనీయుల నమ్మకం. అందుకే లైంగిక సామర్థ్య పెంపుదల కోసం అడవి జంతువుల మాంసాన్ని తింటారు. ఈ నేపథ్యంలో గబ్బిలం, అలుగుల మాంసం తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందనే నమ్మకంతో చైనా సంపన్నుల కక్కుర్తే….ఈ వేళ ప్రపంచం కరోనా వైరస్ బారిన పడటానికి కారణమైంది.
చైనా దేశస్తుల చిత్రవిచిత్రమైన, విపరీత కోరికల వల్ల మన దేశంతో పాటు చాలా దేశాల్లో వణ్యప్రాణులైన పులులు, ఖడ్గ మృగాలు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. చైనీయుల ఆహార అలవాట్ల గురించి తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
గబ్బిలాలు, పాములు, పునుగు పిల్లులు, అలుగులు, ముళ్ల పందులు తదితర అడవి జంతువుతో పాటు పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులను కూడా చైనీయులు చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి తినడం వల్లే కరోనా అనే మహమ్మారి పుట్టుకకు దారి తీసింది. మొత్తానికి చైనాలోని సంపన్నులు లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు ఏది పడితే అది తినడం వల్లే కరోనా వైరస్ పుట్టిందనేది వాస్తవం. మరీ దీన్ని నిర్మూలించడం ఎప్పటికయ్యేనో ఆ దేవుడికే తెలియాలి.