శృంగార సమరంలో ఒక్కరే గెలుపు అనే ఆస్కారమే ఉండదు. పరస్పర సహకారంతో ఇరువురూ గెలవడమే శృంగార సమరంలోని మజా! మరి శృంగారంలో గెలవడమే కాదు, గెలిపించడం కూడా తెలియాల్సింది పురుషుడికే అనేది పాత విషయమే.
మరి ఈ అంశం గురించి మగాళ్ల కోసం ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు జరుగుతూనే ఉంటాయి! అవి చెప్పే విషయాలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఇవి ఎవ్వరికీ తెలియని కిటుకలని అనలేరు కానీ, అధ్యయనాలు మాత్రం ఇలా చెబుతున్నాయి!
ముద్దు పెట్టడం తెలియాలి!
శృంగార సమరణానికి సన్నద్ధం కావడంలో ముద్దుది కీలక పాత్ర అనేది పరిశోధనలు చెప్పే సూత్రం. సున్నితమైన పెదవులతో సున్నితంగా మొదలుపెట్టి… దాన్ని రఫ్ కిస్ గా మార్చాలి.
కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ దొరకనివ్వనంత స్థాయి వరకూ ఈ చుంభనాలను తీసుకెళ్లాలి. గ్యాప్ ఇచ్చినట్టుగా ఇచ్చి అదరామృతాన్ని పంచుకోవాలని శృంగార శాస్త్రం చెబుతోంది.
ఫోర్ ప్లే దే కీలక పాత్ర!
శృంగారకాండ పరస్పర విజయంలో కీలకమైనది ఫోర్ ప్లే ఘట్టమే అని అధునాతన సెక్సాలజిస్టులు పదే పదే చెబుతూ ఉంటారు. ఎక్కడ మొదలుపెడతారో, ఎలా మొదలుపెడతారో మీ ఆసక్తే … అయితే ఫోర్ ప్లేతోనే శృంగార కాండ రసవత్తరం అవుతుందనేది వారు స్పష్టంగా చెప్పే విషయం.
డర్టీ టాక్ కు వెనుకాడొద్దు!
శృంగారం అంటే కేవలం చేష్టలే కాదు.. మాటలు కూడా అనేది కూడా అధునాతన శృంగార అధ్యయనకర్తలు సూత్రీకరించే అంశం. పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా ఆ సమయంలో అర్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. అంతే కాదు.. మాటలు కూడా మరింతగా రెచ్చగొడతాయని, వాటిని ఆ విధంగానే వాడుకోవచ్చని సెక్సాలజిస్టులు సూచిస్తూ ఉంటారు. రససమయంలో డర్టీటాక్ ఇచ్చే కిక్కే వేరంటూ వర్ణించి చెబుతూ ఉంటారు. క్లైమాక్స్ కు తీసుకెళ్లడంతో డర్టీ టాక్ మంత్రంలా పని చేస్తుందంటారు. ఆ గుసగుసలతో మజానే వేరంటారు.
ఓరల్ సెక్స్ కూడా సమ్మతమైనదే!
అధునాతన సెక్సాలజిస్టులే గాక పురాతన కామశాస్త్రాల్లో కూడా ఓరల్ సెక్స్ పట్ల సమర్థింపు కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో కొందరికి విముఖత ఉండవచ్చు. కానీ ఓరల్ సెక్స్ కూడా శృంగారంలో సమ్మతమైన అంశమని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
క్విక్ సెక్స్.. బెస్ట్ క్లైమాక్స్!
స్లోగా మొదలుపెట్టి .. ఒక స్టైల్లో కొనసాగించడమే కాదు.. క్విక్ గా సాగించడం కూడా సెక్స్ లో కీలకమైనది అని పరిశీలనలు చెబుతున్నాయి. పరస్పరం పతాక స్థాయిని చేరే సమయంలో.. క్వికీస్ ఎంతో మజానిస్తాయని శృంగార శాస్త్ర ప్రావీణ్యతను వివరిస్తున్నారు.
శృంగారాన్ని మరింత మజాను చేసే సలహాలు, సూచనలు ఇవంటున్నాయి.. పురాతన, ఆధునిక శృంగార అధ్యయనాలు.