బాధ్యత వారికేనా!

జనం ఓటేసి గెలిపిస్తేనే మేము కూడా పలికేది అన్నట్లుంది తెలుగు తమ్ముళ్ళ రాజకీయం. ఎన్నికల్లో ఓడాం, కాబట్టి మేమేం చేయాల్సింది లేదు, కేవలం విమర్శలు  చేస్తూ అధికార పార్టీపై బురద జల్లేస్తే పోతుందన్న తీరులో …

జనం ఓటేసి గెలిపిస్తేనే మేము కూడా పలికేది అన్నట్లుంది తెలుగు తమ్ముళ్ళ రాజకీయం. ఎన్నికల్లో ఓడాం, కాబట్టి మేమేం చేయాల్సింది లేదు, కేవలం విమర్శలు  చేస్తూ అధికార పార్టీపై బురద జల్లేస్తే పోతుందన్న తీరులో  తమ్ముళ్ళున్నారు.

ఉత్తరాంధ్రా  టీడీపీలో మేటి, ఘనాపాటి నాయకులు ఎందరో ఉన్నారు. వారంతా మాజీలయ్యారు. మరిపుడేంచేస్తున్నారు అంటే ఎవరికి వారు స్వీయ నిర్బంధం పేరిట ఒక్కసారి గాయబ్ అయ్యారు.

ఇందులో మహా నాయకులు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. వీరంతా ఇపుడు ఎక్కడ అంటే ఏమో అన్న సమాధానమే  వస్తోంది జనతా కర్ఫ్యూ ముందు నుంచే పచ్చ పార్టీ బడా నాయకులు ఏకాంత  వాసాలు వెతుక్కున్నారు.

నాటి నుంచి వారి అయిపూ అజా లేకుండా పోయింది. ఇవన్నీ సరే, కరోనా వైరస్ జాగ్రత్తలు అని అనుకున్నా, ఇంతటి విలయంలో దేశమంతా  అవస్థలు పడుతూంటే కనీసం తమ వంతు ఆర్ధిక సాయంగా చేసేది ఏమైనా ఉందా అంటే లేదనే అనేస్తున్నారు.

మంత్రులుగా అయిదేళ్ళు అధికారాన్ని నట్టింట్లో కట్టుకున్న పెద్ద నాయకులు సైతం విరాళాలు ఇవ్వకపోవడం విచిత్రమనుకుంటే, తమను నిన్నటి దాకా ఓటేసి గెలిపించిన జనాలకు ధైర్యం చెప్పాల్సిన వేళ ఇలా కరోనా భయంతో దుప్పటి కప్పుకుని పడుకున్న పచ్చ పార్టీ నేతలను చూసి ఏమనాలో.

మరికొందరి తమ్ముళ్ళ  తీరు ఇంకా ఘోరంగా ఉంది. అధికార పార్టీ తప్పలను ఎంచుతూ బురద జల్లే కార్యక్రమంలో బిజీ ఉన్నారు. అంటే  కరోడా లాంటి కరోనా అయినా వీరి రాజకీయాన్ని మార్చలేకపోయిందన్నమాటేగా.

బన్నీ ఎంత ఇచ్చాడో తెలుసా

నిరుపేద కళాకారులకు నిత్యావసరాలు సరఫరా చేసిన రాజశేఖర్