మరి ఇలాంటి పనులన్నీ ప్రచారం కోసం చేస్తారా.. అనే సందేహాలు కలగకమానవ్. ఒకసారి అంటే ఏదో పొరపాటున జరిగి ఉంటాయని అనుకోవచ్చు. అయితే రాధికా ఆప్టే విషయంలో మాత్రం లీకేజీ చాలా కామన్ అయిపోనట్టుంది. ఇప్పటికే పలుదఫాలుగా రాధిక నగ్న చిత్రాలు ఇంటర్నెట్ లో ప్రచారంలోకి వచ్చాయి. ఆమె తీసుకున్న నగ్న సెల్ఫీలు అని ఒకసారి.. అనురాగ్ కశ్యప్ తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ సందర్భంలో మరోసారి.. రాధిక న్యూడ్ పిక్స్ హీటు పుట్టించాయి.
అసలు అలాంటి వాటిని ఏ మాత్రం ఖాతరు చేయనట్టుగా వ్యవహరిస్తోంది రాధిక. అనురాగ్ వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్ సమయంలో అయితే… రాధిక చేసిన నగ్న సన్నివేశం ఆ ఫిల్మ్ లో భాగమే అని కూడా వార్తలు వచ్చాయి. ఎడిటింగ్ రూమ్ నుంచి అది లీకయ్యిందన్నారు. అంత జరిగితే..ఆ సినిమా యూనిట్ కనీసం పోలిస్ కంప్లైట్ కూడా ఇవ్వలేదు!
ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇదే హీరోయిన్ కు సంబంధించి మరో సారి లీకేజీ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సారి అజయ్ దేవగణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఒక సినిమా షూటింగు సెట్స్ మీద పిక్చర్లు వెలుగులోకి వచ్చాయి. షూటింగులో భాగంగా సహచరనటుడితో రాధిక రొమాన్స్ లో ఉండగా తీసిన చిత్రాలు ఇవి.
అయినా పొరపాటు అయితే ఒకసారి, రెండు సార్లు జరగవచ్చు.. కానీ ఒకే నటి పూర్తి నగ్న చిత్రాలు పదే పదే బయటకు రావడం ఏమిటో!