అవసరం తెచ్చిన ‘తిక్క’

తిక్క సినిమా చూసిన వాళ్లందరికీ ఒకటే అనుమానం. రేయ్ తరువాత సరైన సినిమాలు ఎంచుకుంటూ వస్తున్న హీరో సాయి ధరమ్ తేజ ఎందుకు ఇలాంటి సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాడా అని? అయితే ఈ…

తిక్క సినిమా చూసిన వాళ్లందరికీ ఒకటే అనుమానం. రేయ్ తరువాత సరైన సినిమాలు ఎంచుకుంటూ వస్తున్న హీరో సాయి ధరమ్ తేజ ఎందుకు ఇలాంటి సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాడా అని? అయితే ఈ సినిమా ఓకె చేయడం వేనుక అసలు సంగతి వేరే వుందట. 

రేయ్ సినిమా చేసిన కొత్తలో తిక్క సినిమా ఓకే చేసాడట. అప్పట్లో కథ, లైన్ ఏవీ వినకుండా కేవలం అడ్వాన్స్ కోసమే సాయి ధరమ్ ఆ సినిమా ఒప్పుకున్నాడని వినికిడి. అప్పట్లో సాయి ధరమ్ దగ్గర పైసలు కాస్త కటకటగానే వుందట. రేయ్ సినిమా తరువాత దిల్ రాజు సినిమా ఓకె అన్నా అడ్వాన్స్ ఏమీ రాలేదట. డబ్బులకు కాస్త ఇబ్బందిగానే వండేదట. మామయ్యల దగ్గర నుంచి ఫైనాన్స్ హెల్ప్ ఏమీ వుండేది కాదని తెలుస్తోంది. 

అలాంటి టైమ్ లో అడ్వాన్స్ రావడంతో ఒకె అన్నాడట. అయితే తీరా లైన్, కథ విన్నాక దాన్ని అలా అలా నెట్టుకు వచ్చాడట. మూడు సినిమాలు ఫరవాలేదు అనిపించుకున్నాక, ఓ సినిమా ఫ్లాప్ అయినా ఫరవాలేదు అనిపించకున్నాక, తిక్క ఫినిష్ చేసాడట. 

ఇదిలా వుంటే తిక్క నిర్మాత కూడా తలపట్టుకుంటున్నాడట. 18 కోట్లు ఖర్చు చేసి ఇలాంటి సినిమా అందించానా అని ఇప్పుడు మధనపడుతున్నాడట. దర్శకుడు తనకు చెప్పింది ఒకటి చేసింది మరొకటి అని కిందా మీదా అవుతున్నాడట నిర్మాత రోహిణ్ రెడ్డి.