పంచెకట్టులో పవన్

సినిమా మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచ కట్టులో వుంటారట..కీలకమైన ఈ సంగతిని వెల్లడించేసారు పవన్ తరువాతి సినిమా మాజీ దర్శకుడు ఎస్ జె సూర్య. మరి పాటల్లో అయినా రెగ్యులర్ ఫార్మాట్…

సినిమా మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచ కట్టులో వుంటారట..కీలకమైన ఈ సంగతిని వెల్లడించేసారు పవన్ తరువాతి సినిమా మాజీ దర్శకుడు ఎస్ జె సూర్య. మరి పాటల్లో అయినా రెగ్యులర్ ఫార్మాట్ లో కనిపిస్తారో, లేదో? పైగా రాయలసీమ ఫ్యాక్షనిజం అంట. 

ఇప్పుడున్న గ్రే అండ్ వైట్ షేడ్ హెయిర్..గెటప్ అందుకోసమేనా అని అనుమానం. పవన్ ఎలా వున్నా మా కిష్టమే.. ఏం కట్టుకున్నా మాకు ఇష్టమే అని అభిమానులు అంటే అనొచ్చు. కానీ పవన్ అభిమానుల్లో అమ్మాయిల సంఖ్య తక్కువేమీ కాదు. మరి వారి మాటేమిటో? తమిళ సూపర్ స్టార్ అజిత్ మాదిరిగా ఏజ్డ్ లుక్ తో డిఫరెంట్ గా ట్రయ్ చేయాలనుకుంటున్నారేమో పవన్? 

అది అలా వుంటే.. రాయలసీమ.. ఫ్యాక్షనిజం.. పంచెకట్టు.. కడపకింగ్ అనే టైటిల్ వినిపించడం చూస్తుంటే, ఇదేదో కాస్త కావాలని చేస్తున్న సినిమాలాగే కనిపిస్తోంది. మరోసారి జగన్ నో, జగన్ నేఫథ్యాన్నో , ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, టచ్ చేయరు కదా?