బాలయ్య ‘యోధుడు’

బాలయ్య సినిమా అంటే టైటిల్ ఓ రేంజ్ లో వుండాలి. సింహా, లెజెండ్, లయన్ ఇలా.. ఇప్పుడు వందో సినిమాకు యోధుడు అన్న టైటిల్ అయితే ఎలా వుంటుందీ అని పరిశీలిస్తున్నారట. దర్శకుడు క్రిష్…

బాలయ్య సినిమా అంటే టైటిల్ ఓ రేంజ్ లో వుండాలి. సింహా, లెజెండ్, లయన్ ఇలా.. ఇప్పుడు వందో సినిమాకు యోధుడు అన్న టైటిల్ అయితే ఎలా వుంటుందీ అని పరిశీలిస్తున్నారట. దర్శకుడు క్రిష్ అందించే సినిమా ఇది. చారిత్రాత్మిక చిత్రం.. అమరావతిని ఏలిన రాజవంశం నేపథ్యంలో సాగే కథ. 

అయితే అలా అని ఏదో పాత్ర పేరుతో టైటిల్ పెడితే అది అన్ని రకాల ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యాన్స్ కు చేరువ అవుతుందో, కాదో అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే యోధుడు అయితే కనుక, బాలయ్య బాబు సినిమాకు పక్కా సూట్ అవుతుందని అనుకుంటున్నట్లు వినికిడి.

ఇదిలా వుంటే బాలయ్య కొంచెం ఇటు క్రిష్.. అటు కృష్ణవంశీ ఇద్దరూ స్క్రిప్ట్ తయారీలో బిజీగా వున్నారు. క్రిష్ సినిమా వందో సినిమా గానూ, కృష్ణవంశీ నూట ఒకటొ సినిమాగానూ రెడీ చేయాలన్నది బాలయ్య ఆలోచనగా తెలుస్తోంది. వందో సినిమా ప్రారంభమై, వర్క్ కొంత వరకు అయ్యాక నూట ఒకటో సినిమా ప్రారంభించాలా? లేదా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు గా రెండింటికీ ఒకేసారి కొబ్బరికాయ కొట్టాలా అని ఆలోచిస్తున్నారట.