సినిమాల్లో విలన్లు.. యాడ్స్ లో హీరోలు..!

ఎండార్స్ మెంట్స్ లో నటించే అవకాశాలు.. కార్పొరేట్ బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరించే అవకాశాలు.. కేవలం సినిమా హీరోలకు, హీరోయిన్లకు, క్రికెటర్లకు ఇతర టాప్రేంజ్ సెలబ్రిటీలకు మాత్రమే దక్కే అవకాశాలు కాదు.  కాస్తంత పేరు ప్రఖ్యాతులు…

ఎండార్స్ మెంట్స్ లో నటించే అవకాశాలు.. కార్పొరేట్ బ్రాండ్లకు అంబాసిడర్లుగా వ్యవహరించే అవకాశాలు.. కేవలం సినిమా హీరోలకు, హీరోయిన్లకు, క్రికెటర్లకు ఇతర టాప్రేంజ్ సెలబ్రిటీలకు మాత్రమే దక్కే అవకాశాలు కాదు.  కాస్తంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనేక మందికి ఈ అవకాశాలు దక్కుతూ ఉంటారు. ఇలాంటి అవకాశంపొందే వాళ్లలో సినిమా దర్శకులు, గాయకులు, కేరెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉండటం సహజమైపోయింది. ఈ మధ్య కాలంలో ఈ తీరు విస్థృతమవుతోంది కూడా. వివిధప్రోడక్ట్స్ ను, రియలెస్టేట్ వెంచర్లను ప్రమోట్ చేయడానికి అనేక మంది సెలబ్రిటీలు యాడ్స్ లో కనిపిస్తున్నారు.

 

మరి ఇలాంటి నేపథ్యంలో ఇద్దరు ఫేమస్ విలన్లు.. యాడ్ ఫిలిమ్స్ లో ఆసక్తికరమైన పాత్రల్లో కనిపిస్తున్నారు! నిమిషాల వ్యవధి ఉండే ఈ యాడ్ ఫిల్మ్స్ లో వారుభావోద్వేగాలను పంచే పాజిటివ్ రోల్స్ లో కనిపిస్తుండటం విశేషం. రెండున్నరగంట సేపు ఉండే సినిమాల్లో వీళ్లు ప్రదర్శించే విలనిజానికి భిన్నంగా ఉండే ఈ యాడ్ ఫిల్మ్స్ప్రేక్షకుల్లో కూడా బాగా గుర్తింపుకు నోచుకొంటున్నాయి.

 

ఆశిష్ విద్యార్థి, సంపత్.. ఈ ఇద్దరు ఫేమస్ విలన్లూ యాడ్ ఫిల్మ్స్ లో పాజిటివ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఆ మధ్య ఒక వాటర్ బాటిల్ యాడ్ లో ఒక తండ్రి పాత్రలోకనిపించాడు ఆశిష్ విద్యార్థి. ఆ యాడ్ సూపర్ హిట్ అయ్యింది. కూతురిపై భావోద్వేగభరితమైన ప్రేమను కనబరిచే తండ్రిగా ఆ సినీ విలన్ సక్సెస్ అయ్యాడు. తాజాగా ఒకయాడ్ ఫిలిమ్ లో కనిపిస్తున్నాడు సంపత్, ఒక జెవెలరీ షాప్ వారి యాడ్ లో భర్త పాత్రలో కనిపిస్తున్నాడు సంపత్. భార్యకు నగను ప్రెజెంట్ చేసి సర్ ప్రైజ్ ను ఇచ్చేభర్తగా సంపత్ ఆకట్టుకొంటాడు ఈ యాడ్ లో. వీళ్లు తెరపై కనిపించే తీరుకు అత్యంత భిన్నంగా కనిపించడంతో ఈ యాడ్స్ ఆసక్తిని రేపుతున్నాయి.. సదరు కంపెనీలప్రమోషన్ కు బాగా ఉపయోగపడుతున్నాయి!