చైతూతో రకుల్

రకుల్ ప్రీత్ సింగ్..సునామీలా చుట్టేసింది టాలీవుడ్ ను. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ప్రారంభించి, టాప్ హీరోలందరితో చకచకా జోడీ కట్టి ఆడిపాడేసింది. ఇప్పుడు నాగ చైతన్య తో జోడీ కట్టబోతోందని వినికిడి. విజయాలు…

రకుల్ ప్రీత్ సింగ్..సునామీలా చుట్టేసింది టాలీవుడ్ ను. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో ప్రారంభించి, టాప్ హీరోలందరితో చకచకా జోడీ కట్టి ఆడిపాడేసింది. ఇప్పుడు నాగ చైతన్య తో జోడీ కట్టబోతోందని వినికిడి. విజయాలు సాధిస్తున్న ఓ దర్శకుడు ఈ జోడీతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం చైతూ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. గౌతమ్ మీనన్ సినిమా దాదాపు పూర్తయింది. ఇక ప్రేమమ్ రీమేక్ మజ్ఞు చకచకా సాగిపోతోంది. ఇది కాగానే ఈ కొత్త కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం వుంది. చైతూ సరసన రకుల్ మంచి జోడీ అవుతుందని టాలీవుడ్ టాక్. 

సమంత, కాజల్, తమన్నా లాంటి టాప్ హీరోయిన్ లతో నటించిన చైతూ ప్రస్తుతం గ్లామరస్ హీరోయిన్ శృతితో చేస్తున్నాడు. ఆ సినిమాలోనే మరో ఇద్దరు హీరోయిన్లు వున్నారు. ఇక రకుల్ తో కూడా జోడీ కట్టేస్తే, దాదాపు అందరు టాప్ హీరోయిన్లతో నటించేసినట్లే.