సినిమా అడుగుతున్న పూరి?

సినిమా ప్లాన్ చేయ్ బ్రదర్..ఓ సినిమా ప్లాన్ చేయ్ గురూ అంటూ దర్శకుడు పూరి జగన్నాధ్ తనకు తెలిసిన ఒకరిద్దరు నిర్మాతలను అడిగినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాధ్ చేతిలో…

సినిమా ప్లాన్ చేయ్ బ్రదర్..ఓ సినిమా ప్లాన్ చేయ్ గురూ అంటూ దర్శకుడు పూరి జగన్నాధ్ తనకు తెలిసిన ఒకరిద్దరు నిర్మాతలను అడిగినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాధ్ చేతిలో సినిమా ఏదీ లేదు. రోగ్ సినిమా సంగతి కాస్త అటు ఇటుగా వుంది. పూరి లాంటి స్పీడున్న దర్శకుడు ఖాళీగా వుండలేడు. వారం రోజులు టైమ్ దొరికితే స్క్రిప్ట్ తయారుచేస్తాడు.. నెల రోజులు టైమ్ దొరికితే సినిమా సెట్ చేస్తాడు.. మూడు నెలలు టైమ్ దొరికితే సినిమా ఫినిష్ చేస్తాడు. 

అలాంటి వాడికి చేతిలో సినిమా లేకుంటే.. పైగా భారీ ఆపీసు.. ఎస్టాబ్లిష్ మెంట్.. అయితే పూరి సినిమా చేస్తానంటే ఎవరో ఒక నిర్మాత ముందుకు వస్తారు? కానీ సమస్య ఎవరితో సినిమా అన్నది? ఇప్పుడు పూరి చేయడానికి  తెలుగులో ఏ హీరో రెడీగా వున్నట్లు? మరి హీరో లేనిదే, నిర్మాతలు ఏం చేస్తారు పాపం? అందువల్ల పూరి ఇప్పుడు కాంటాక్టు చేయాల్సింది నిర్మాతలను కాదు.. హీరోలను. 

కానీ పూరి గురువు రామ్ గోపాల్ వర్మ, దాదాపుగా అందరి హీరోలతో పూరి సంబంధాలను తన ట్విట్టర్ కామెంట్లతో వీలయినంత డామేజ్ చేసేసాడు కదా? అది కూడా ఓ సమస్యే.