ఆకట్టుకున్న తాల్‌ ‘కబుర్లు’

లండన్‌ తెలుగు అసోసియేషన్‌ (తాల్‌), సీపీ బ్రౌన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కబుర్లు’ కార్యక్రమం అలరించింది. సీపీ బ్రౌన్‌ వర్ధంతి సందర్భంగా డిసెంబర్‌ 19న హన్‌స్లోలోని న్యూ లండన్‌ కాలేజ్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు…

లండన్‌ తెలుగు అసోసియేషన్‌ (తాల్‌), సీపీ బ్రౌన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కబుర్లు’ కార్యక్రమం అలరించింది. సీపీ బ్రౌన్‌ వర్ధంతి సందర్భంగా డిసెంబర్‌ 19న హన్‌స్లోలోని న్యూ లండన్‌ కాలేజ్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రచయిత, వ్యాసకర్త, రేడియో జాకీ ఎంబీఎస్‌ ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానాటికీ తగ్గిపోతున్న హాస్యరచయితల సంఖ్యపై ఆవేదన వ్యక్తం చేశారు. మూడు గంటల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రపంచంలో జరుగుతున్న పలు పరిణామాలపై చర్చించారు. యువకులు తెలుగు సాహిత్యాన్ని ముందుకు నడిపించాలని కోరారు. 

ఈ సందర్భంగా ఎంబీఎస్‌ ప్రసాద్‌ను తాల్‌ అధ్యక్షుడు సత్యేంద్ర పగడాల, ట్రస్టీలు శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రౌన్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శ్రీరాములు దాసోజు, బి.రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.