ఈ టైటిలేంటి సునీల్?

హీరో టర్న్ డ్ కమెడియన్ సునీల్ మొత్తానికి ఇప్పుడిప్పుడే గాడిలోపడుతున్నాడు. చేతిలో రెండు మూడు సినిమాలు వున్నాయి. వాసు వర్మ డైరక్షన్ లో సినిమా ఫినిష్ అవుతోంది. దీనికి కృష్ణాష్టమి అని కాస్త మంచి…

హీరో టర్న్ డ్ కమెడియన్ సునీల్ మొత్తానికి ఇప్పుడిప్పుడే గాడిలోపడుతున్నాడు. చేతిలో రెండు మూడు సినిమాలు వున్నాయి. వాసు వర్మ డైరక్షన్ లో సినిమా ఫినిష్ అవుతోంది. దీనికి కృష్ణాష్టమి అని కాస్త మంచి టైటిలే పెట్టారు.

ఇదికాక గతంలో ప్రేమకథాచిత్రమ్ సినిమా నిర్మించిన సుదర్శన్ రెడ్డి నిర్మాణంలో ఆకెళ్ల వంశీకృష్ణ దర్ళకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది. దీనికి భటుడు అని టైటిల్  పెట్టినట్లు సమాచారం.

విన్న జనం ఇదేం టైటిల్ అని పెదవి విరుస్తున్నారు. కనీసం సేనాని అన్నా బాగుండేదేమో? భటుడేంటీ? ఈ కాలం జనాలకు ఏం నచ్చుతుందీ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి వింటే సునీల్ మార్చేయమంటాడేమో? అయినా సునీల్ వర్మగారేంటి? భటుడు ఏంటి? పక్కా మిస్ మ్యాచింగ్ కాదూ?