ఢమరుకం..ఆటోనగర్..కార్తికేయ

కొన్ని సినిమలు అదేంటో పాపం..సకాలంలో విడుదలకు నోచుకోవు. నిఖిల్ స్వాతి జంటగా నటిస్తున్న కార్తికేయ సినిమాది అదే సమస్య. మూడు నెలల కిందట విడుదల కావాల్సిన సినిమా. మూడు నుంచి నాలుగు కోట్లలో పూర్తయిపోయి,…

కొన్ని సినిమలు అదేంటో పాపం..సకాలంలో విడుదలకు నోచుకోవు. నిఖిల్ స్వాతి జంటగా నటిస్తున్న కార్తికేయ సినిమాది అదే సమస్య. మూడు నెలల కిందట విడుదల కావాల్సిన సినిమా. మూడు నుంచి నాలుగు కోట్లలో పూర్తయిపోయి, నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ ఇవ్వాల్సిన సినిమా. కానీ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. 

సిజి వర్క్, ఓవర్ హెడ్స్ పెరిగి నష్టాలకు దారితీస్తోంది. అన్ని విథాలా మంచి టాక్ సంతరించుకుని, మంచి రేట్లు అడ్వాన్స్ లు అందుకుని కూడా విడుదలకు ధైర్యం చేయలేకపోతోంది. ఆఖరికి తెగించి అక్టోబర్ 10 వస్తుందనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ 17 లేదా 18 లేదా మళ్లీ మాట్లాడితే ఆఖరు వారం అని అనుకుంటున్నారు. 

వేడి ఒక రుచి. వేడిమీద విడుదలైతే ఆ కలెక్షన్లు వేరు. మరి కార్తికేయ సమస్యలేమిటో, ఈ వైనాన్ని గుర్తించడం లేదు.