నాని ఈజ్ బ్యాక్ అనుకోవాలా?

గడచిన రెండేళ్లుగా చాలా ఇబ్బంది పడుతున్నాడు హీరో నాని సరైన హిట్ లేక. అతగాడి లోపం లేకపోయినా టైమ్ కలిసి రావడం లేదు. ఇప్పుడు కెరీర్ ఒక్కసారి టర్నింగ్ ఇచ్చుకున్నట్లుంది.  Advertisement ఎవడే సుబ్రహ్మణ్యం…

గడచిన రెండేళ్లుగా చాలా ఇబ్బంది పడుతున్నాడు హీరో నాని సరైన హిట్ లేక. అతగాడి లోపం లేకపోయినా టైమ్ కలిసి రావడం లేదు. ఇప్పుడు కెరీర్ ఒక్కసారి టర్నింగ్ ఇచ్చుకున్నట్లుంది. 

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు నానికి మంచి అప్లాజ్ వచ్చింది. కలెక్షన్లు కూడా ఓకె. ఒకే హీరో సినిమాలు రెండు ఒకేసారి విడుదలైతే కష్టం. కానీ చిత్రం నాని జెండాపై కపిరాజుక కూడా దీంతో పాటే విడుదలై కలెక్షన్లలతో ఫరవాలేదనిపించుకుంది. ఇదే సమయంలో మణిరత్నం ఒకె బంగారం సినిమాలో హీరో మమ్ముట్టి కోడుకుకు స్వరదానం చేసే అవకాశం వచ్చింది. 

వేరే సినిమాకు అయితే నో అనేవాడేమో కానీ దిల్ రాజు నిర్మాత, మణిరత్నం దర్శకుడు అందకే ఓకె అన్నాడు. ఇప్పుడు ఆ విధంగా కూడా నాని ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. నానితో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించే సినిమా ప్రారంభమయింది. మారుతి దీనికి దర్శకుడు. త్వరలో మరో ప్రాజెక్టు కూడా ప్రారంభమవుతుంది. అంటే నాని ఈజ్ బ్యాక్ అన్నమాటే.