ప్రేమమ్ తయారు కాకుండానే..

నాగ చైతన్య మార్కెట్ దోచేయ్ సినిమా తరువాత దారుణంగా పడిపోయింది. అలాంటి టైమ్ లో ప్రేమమ్ రీమేక్ కు ఓకె అన్నారు. ఎలా వుంటుందో అనుకున్నారు. అయితే రాధాకృష్ణ బ్యానర్ వాల్యూనో, చందు మొండేటి…

నాగ చైతన్య మార్కెట్ దోచేయ్ సినిమా తరువాత దారుణంగా పడిపోయింది. అలాంటి టైమ్ లో ప్రేమమ్ రీమేక్ కు ఓకె అన్నారు. ఎలా వుంటుందో అనుకున్నారు. అయితే రాధాకృష్ణ బ్యానర్ వాల్యూనో, చందు మొండేటి ఫస్ట్ సినిమా పేరు వల్లో, అప్పుడే ఇంకా సెట్ మీదకు వెళ్లకుండానే బిజినెస్ అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. 

నైజాంకు దిల్ రాజు మాంచి రేటు ఇచ్చి తీసుకున్నట్లు వినికిడి. ఓవర్ సీస్, శాటిలైట్ కూడా మాటలు జరిగిపోయాయిు. ఈ మూడూ కలిపి పదకొండు కోట్ల వరకు రాబట్టినట్లు వినికిడి. సినిమాకు ఆ మేరకు ఖర్చు కూడా వుంటుంది. ఎందుకంటే శృతి హాసన్ కోటీ పాతిక, నాగ్ చైతన్య మూడు కోట్లు తీసుకుంటారు. మరో ఇద్దరు చిన్న కథానాయికలు వున్నారు. 

రీమేక్ రైట్స్ కు కొటి రూపాయిలు ఇచ్చారు. సో..స్టార్ కాస్ట్..రీమేక్ రైట్స్ కలిపే ఆరేడు కోట్ల మేరకు డేకేస్తుంది. టెక్నికల్ స్టాఫ్, ప్రొడక్షన్ ఖర్చు కలుపుకుంటే..కాస్త గట్టిగానే అయ్యేలా వుంది.