కొణిదెల నీహారిక..మెగా క్యాంప్ నుంచి వస్తున్న తొలి హీరోయిన్. అయితే టాలీవుడ్ లో హీరోల కూతుర్లు రంగంలోకి రావడం చాలా చాలా అరుదు. గతంలో హీరో కృష్ణ ట్రయ్ చేసినా, ఫ్యాన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆగిపోయారు. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఒక్కరే దిగ్విజయంగా నటిగా కొనసాగుతున్నారు. హీరోయిన్ల కూతుర్లు వస్తారు కానీ, హీరోల కూతుర్లు కాదు.
నాగబాబు కుమార్తె నీహారిక ఫీల్డ్ లోకి వస్తానంటే, ఇంట్లోనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయం చిరంజీవే స్వయంగా చెప్పారు. ఇంట్లో అందరం డిస్కసం చేసాం అని, పెద్దగా ఇష్టం లేకపోయినా, అమ్మాయి చాలా ఇంట్రెస్ట్ గా వుందని ఓకె అన్నామని.
ఇప్పుడు తాజా బజ్ ఏమిటంటే, నీహారిక నిర్ణయం ఫైనల్ అయ్యే ముందు, మెగ్యాఫ్యామిలీలోని యంగ్ స్టార్స్ కూడా ఆమెను ఆ ప్రయత్నం నుంచి విరపింపచేసే ప్రయత్నం చేసారట. మరి ఏ విధంగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసారో తెలియదు కానీ, ఆమె మాత్రం మంచి సబ్జెక్ట్ అని వాళ్లనే తిరిగి ఒప్పించిందట. దాంతో వాళ్లు కాదనలేకపోయారట. ఇలా ట్రయ్ చేసిన వారిలో అల్లు శిరీష్ కూడా వున్నాడట.
కజిన్న్ ఓ విషయం క్లారిటీగా చెప్పారని తెలుస్తోంది. మెగా హీరోలందరూ కలిసి ఏడాదికి కనీసం అరడజను సినిమాలకు పైగానే చేస్తున్నారు. నీహారిక కు నటించడమే ఇష్టం అనుకుంటే వాటిల్లో స్పెషల్ రోల్స్, లేదా సిస్టర్ రోల్స్ చేసుకోవచ్చు..తమ సినిమాలకే కాబట్టి మంచిపాత్రలు ఏర్పాటు చేసుకోవచ్చు..అంతే కానీ బయట సినిమాల్లో హీరోయిన్ పాత్రలు వద్దు. పైగా హీరోయిన్ గా ఎన్నాళ్లో నిలదొక్కుకోలేదు కాబట్టి, ముందుగానే ఇలా ప్రత్యేక పాత్రల్లో ప్రథ్యేకమైన గుర్తింపు పొందితే బాగుంటుంది..ఇదీ వాళ్లు చెప్పిందని ఫ్యాన్స్ వర్గాల బోగట్టా.
మొత్తానికి తెలుస్తున్నదేమిటంటే, నీహారిక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ మెగా ఫ్యామిలీ జనాలకు అంతగా ఇష్టం లేదని. ఆమె పట్టుదల మేరకు ఓకె అన్నారని.మరి ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో?
నీహారిక హీరోయిన్ గా నాగ శౌర్య హీరోగా, రామ రాజు దర్వకత్వంలో మధుర శ్రీధర్ ఒక్క మనసు పేరుతో సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.